టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో సంచలన విజయాలు అందుకున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్లు కూడా చాలానే ఉన్నాయి. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా డిజిటల్ ఫ్లాట్ ఫాం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రస్తుతం అల్లు అరవింద్ దాని మీద ఫోకస్ చేశాడని తెలుస్తుంది.


అల్లు అరవింద్ ఇంకా ఒకరిద్దరు పార్ట్ నర్స్ తో డిజిటల్ స్పేస్ లోకి రాబోతున్నారట. ఇప్పటికే అమేజాన్, నెటి ఫ్లిక్స్ డిజిటల్ ఫ్లాట్ ఫాంపై సత్తా చాటుతున్నారు. ఇక బాలీవుడ్ ఏక్తా కపూర్ ఏఎల్టి బాలాజి వారు కూడా డిజిటల్ ఫ్లాట్ ఫాం లో బాగా సక్సెస్ అయ్యారు. హాట్ స్టార్ కూడా ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చింది.  


అలాంటిదే జీ5 అనే డిజిటల్ ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేస్తున్నారట. 150 కోట్లతో ఓన్లీ కంటెంట్ మేకింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. కేవలం సినిమాలతోనే కాకుండా క్రియేటర్స్ కు ఈ విధంగా కూడా అవకాశాలు ఇచ్చేందుకు ఈ స్టెప్ తీసుకున్నారు. అంతేకాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం లో కూడా డబ్బులు బాగానే వస్తున్నాయి. అందుకే అల్లు అరవింద్ ఈ కొత్త స్టెప్ తీసుకున్నారట.


ఇక తెలుగు సినిమాల వరకు అమేజాన్ ప్రైం ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లోనే వేస్తున్నారు. అందుకే అల్లు అరవింద్ డిజిటల్ ఫ్లాట్ ఫాం లోకి వస్తే తెలుగు సినిమాలు ముందు ఆయన్ను దాటి వెల్లవు. కాబట్టి ఇలా కూడా అల్లు అరవింద్ తన బిజినెస్ ఎక్స్ పాండ్ చేస్తున్నారు. నిర్మాతగానే కాదు బిజినెస్ హ్యాండిల్స్ లో కూడా అల్లు అరవింద్ తెలివితేటలు అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: