గ‌త కొంత కాలంగా మాస్ మ‌హారాజా ర‌వితేజ చాలా డ‌ల్‌గా క‌న‌ప‌డుతున్నారు. కార‌ణం ఏంటంటే ప‌నిగ‌ట్టుకుని కొంత‌మంది త‌న పై దుష్ర్ప‌చారం చేస్తున్నార‌ని మ‌న‌స్తాపం చెందారు. త‌న‌ సినిమాలు కొన్ని ఆగిపోయాయని, తనను పెట్టి సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని కొంతమంది ఎందుకో ప్రచారం చేస్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. నేల టిక్కెట్టు తరువాత తను నటిస్తున్న డిస్కోరాజా సినిమా మొదటి దశ షూటింగ్ పూర్తయ్యింది.


సెకండ్ హాఫ్ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ కొంతమంది డిస్కో రాజా సినిమా ఆగిపోయిందని, నిర్మాతకు, రవితేజకు పడలేదని ప్రచారం చేస్తున్నారు. తాను అడిగినంత డబ్బు నిర్మాత ఇవ్వలేదని కూడా రకరకాలుగా ప్రచారం చేసేస్తున్నార‌ని స్వ‌యంగా ఆయ‌నే వెల్ల‌డించారు.  దయచేసి మీకు రెండు చేతులు జోడించి చెబుతున్నా. నేను సాధారణ నటుడిని. నాకు అహంకారం లేదు.


నా పని నేనేదో చేసుకుంటూ పోతున్నాను. నాకు తెలుగు చిత్రసీమలో రికమెండేషన్ కూడా లేదు.ఇక నా గురించి వదంతులు సృష్టించకండి అంటున్నారు రవితేజ. మ‌రి ఇలా ఎవ‌రు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అన్న‌ది అర్ధం కావ‌డంలేదు. ఈమ‌ధ్య‌కాలంలో వ‌చ్చిన రాజా ది గ్రేట్ త‌ర్వాత హిట్‌లు లేవ‌ని అ చిత్రం కూడా ఆశించినంత ఫ‌లితంగా ఆడ‌లేద‌నో ఆయ‌న మీద ఇలాంటి వార్త‌లు వెలువ‌డ‌తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: