మహేష్ మహర్షి రిలీజ్ కు ఓ రోజు ముందు అనుకోని కష్టకాలం వచ్చింది. ఇప్పటికే ఐదు షోలు పర్మిషన్ కోసం అడుగగా అది కుదరదని తెలంగాణా ప్రభుత్వం చెప్పింది. ఇదిలాఉంటే టికెట్ రేటుపై తెలంగాణా ప్రభుత్వం మహర్షి సినిమా నిర్మాతలపై సీరియస్ గా ఉంది. ఇదిచాలదు అన్నట్టు మహర్షి నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఆఫీస్ లో ఐటి రైడ్స్ జరుగుతున్నాయి.


అనూహ్యంగా మహర్షికి ఒకేసారి ఇన్ని కష్టాలు వచ్చాయి. సాగర్ సొసైటీలోని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర ఆఫీస్ లో ఐటి రైడ్ జరిగిందట. సినిమాకు పెట్టిన బడ్జెట్ లెక్కలను అడిగారట. ఇంకా ఐటి సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. అయితే మహర్షికి దిల్ రాజుతో పాటుగా అశ్వనిదత్, పివిపి నిర్మాతలుగా ఉన్నారు. మరి వారిపై కూడా ఐటి రైడ్ జరుగుతుందా లేదా అన్నది చూడాలి.


మహేష్ మహర్షి సినిమా రిలీజ్ కు ముందు ఇలా అనవసరమైన తలనొప్పుల్లో ఇరుక్కుంటుంది. మా పర్మిషన్ లేకుండా టికెట్ ప్రైజ్ పెంచారని తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉండగా దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు ఇంకా అనుమానాలకు తావిస్తుంది. అయితే ఏది ఏమైనా రేపు మాత్రం మహర్షి సినిమా రిలీజ్ అవడం కన్ఫాం. అయితే నిర్మాతలు ఇలా ఐటి రైడ్స్ జరగడంతో కాస్త కంగారు పడాల్సి వస్తుంది.


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కిన మహర్షి సినిమాలో మహేస్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది. సినిమాలో మహేష్ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలిసిందే. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న మహర్షి కెరియర్ లో మైన్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.


సంక్రాంతి తర్వాత పెద్ద హీరోల సినిమాలు పెద్దగా సందడి చేయలేదు. అందుకే మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేసిన ఈ మహర్షి మరోసారి తన స్టామినా ఏంటో చూపించేలా ఉంటుందని అంటున్నారు. మరి మహర్షి చేసే ప్రభంజనాలు ఎలా ఉంటాయో మరో 24 గంటలు ఆగితే తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: