"పెళ్ళి చూపులు" సినిమాతో క్లాస్ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" సినిమాతో ఒక్క సారిగా ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. బోల్డ్ కంటెంట్ తో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కి బోలెడన్నీ ఆఫర్స్ ని ఇవ్వడమే కాకుండా యూత్ ఐకాన్ గాను పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఒకరకంగా ఈ సినిమా నాలుగు హిట్ సినిమాల క్రేజ్ ని తెచ్చిపెట్టింది. మధ్యలో రెండు ఫ్లాప్‌లు పడ్డా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన "గీత గోవిందం" సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరి తిరుగు లేని స్టార్ డం ని సంపాదించుకున్నాడు. 


ఎప్పటినుండో  రిలీజ్ అవకుండా ఉన్న "టాక్సీవాలా" కూడా "గీత గోవిందం" దెబ్బతో థియోటర్స్‌లోకి వచ్చి మంచి కలెక్షలను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమాతో కూడా విజయ్ ఖాతలో ఓ హిట్టు పడింది. ఇలా ఫుల్ జోష్ లో దూసుకు పోతున్న విజయ్ కి "డియర్ కామ్రేడ్" మాత్రం ఎప్పటికప్పుడు బ్రేకులు వేస్తూనే ఉంది. దాంతో విజయ్ వెనక్కి వెళుతూనే ఉన్నాడు. "డియర్ కామ్రేడ్" లో "గీత గోవిందం" కాంబినేషన్ రిపీటవుతుండటంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 


విజయ్- రష్మిక ఈసారి ఏ మ్యాజిక్ చేస్తారో అని. కానీ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే మిగిలింది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 31న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిత్ర బృందం అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా మళ్ళీ పొస్ట్ పోన్ అయినట్టుగా లేటెస్ట్ అప్‌డేట్. కారణాలేంటో తెలీదు గాని "డియర్ కామ్రేడ్" జూలై నాలుగో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: