ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన దగ్గర్నుంచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేరు వివాదాల్లో మారుమోగిపోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్షయ్ కుమార్ ఓటు వేయకపోవడంతో ఆ విషయం న్యూస్ లో ప్రధాన టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు తాజాగా అక్షయ్ అసలు భారతీయ పౌరుడే కాదంటూ కొత్త వివాదం రాజుకుంది. అందుకే  అతను ఓటేయలేదని, అటువంటి వ్యక్తికి దేశం కోసం మాట్లాడే అర్హత లేదని విమర్శలు చెలరేగాయి. 


ఈ వివాదంలో లోతుకు వెళ్తే నిజానికి అక్షయ్ కుమార్ కు కెనడా పౌరసత్వం ఉంది. దాంతో అతని పాస్‌పోర్ట్ కూడా కెనడాదే. జన్మత: భారతీయుడు అయినప్పటికీ సాంకేతికంగా చూసుకుంటే అక్షయ్ కెనడా పౌరుని కింద లెక్క. దీన్నే హైలెట్ చేస్తూ ఇప్పడు కొందరు అక్షయ్ ను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వ్యక్తులే ఈ వివాదాన్ని పుట్టించారని, దాన్ని మరింతగా పెంచుతున్నారని రూమర్లు ఉన్నాయి. 


మరోవైపు ఈ వివాదంపై అక్షయ్ కుమార్  స్పందించారు. "తన దేశభక్తిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అది అందరికీ తెలుసని" వ్యాఖ్యానించారు. ఇక అక్షయ్ భారతీయ జనతా పార్టీ కూడా తనవంతు మద్ధతు అందిస్తోంది. "అక్షయ్ దేశం కోసం చేసిన పనులు అందరికీ తెలిసిన విషయాలే అని అమర సైనికుల కోసం ఆయన ఎన్నో మంచి పనులు చేసారని" కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు ట్వీట్ చేసారు. మొత్తానికి ఇప్పుడు రాజకీయ వేడి సినిమా ఇండస్ట్రీని కూడా తాకింది


మరింత సమాచారం తెలుసుకోండి: