మహేష్ బాబు టాలీవుడ్లో సూపర్ స్టార్. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఇమేజ్ అలా పెంచెసుకుంటున్నాడు. వయసు గ్లామర్ ని రెట్టింపు చేస్తూ ఉంటే ఒక్కో సినిమా స్టార్ డమ్  కి  కొత్త అర్ధం చెప్పేస్తోంది. మహేష్ ఇపుడు పాతికేళ్ళ వాడు. పాతిక సినిమాలు చేసిన నవ యవ్వనుడు. మహేష్ మైల్ స్టోన్ మూవీగా మహర్షి విడుదల అవుతోంది. ఈ మూవీతో మహేష్ బంపర్ హిట్ కొట్టి టాలీవుడ్ హిస్టరీ మైంద్ బ్లాంక్ అయ్యేలా చేస్తాడని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.


మహర్షిలో మహేష్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. పెద్ద సినిమా కోసం వాచిపోయిన జనాలకు వేసవి చల్లదనంగా మహర్షి రిలీజ్ అవుతోంది. ఈ మూవీ టాప్ రేంజిలో  ఉంది. అంచనాలు కూడా ఆకాశాన్ని మించుతున్నాయి. హిట్ టాక్ వచ్చేసింది. కలెక్షన్లు కుమ్మేస్తాయని అంటున్నారు. మరి అవి అదిరిపోయే రేంజిలో  ఉంటాయని కూడా తెలుస్తోంది.


మొత్తానికి మహేష్ 25 నంబర్ మూవీ అద్భుతాలే క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకూ టాలీవుడ్లో నాన్ బాహుబలి రికార్డులను మహర్షి దుమ్ము దులిపేస్తుందని కూడా సినీ అనలిస్టులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. పాతికేళ్ల మహేష్ ఈ ఫీట్ ని సునాయాసంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినీ మహర్షి టాలీవుడ్ కి కొత్త దారి చూపిస్తాడని అంటున్నారు. చూడాలి మహేష్ మ్యాజిక్ మరెన్ని విధాలుగా మ్యూజిక్ వినిపిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: