ఈరోజు విడుదలైన ‘మహర్షి’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో ఈమూవీకి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2000 ధియేటర్లలో ఈమూవీ విడుదల అవ్వడంతో ఈమూవీ నాన్ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అన్న ప్రాధమిక అంచనాలు వస్తున్నాయి. 

ఇప్పటి వరకు ఈసినిమా ప్రమోషన్ కు దూరంగా ఉన్న నమ్రత స్వయంగా రంగంలోకి దిగి ‘మహర్షి’ సూపర్ సక్సస్ అవ్వాలని కోరుకుంటూ కొందరు ప్రముఖ సెలెబ్రెటీలు చెప్పిన సందేశాలతో ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో త్రివిక్రమ్ సుకుమార్ శ్రీనువైట్ల మురగదాస్ ఇలియానా శృతి హాసన్ లాంటి సెలెబ్రెటీల అభినందనలతో పాటు కరణ్ జోహార్ సమంతల విషెస్ కూడ ఈ వీడియోలో ఉన్నాయి. 

సమంత మహేష్ గురించి ఈ వీడియోలో మాట్లాడుతూ మహేష్ నటవిశ్వరూపం ఈమూవీలో కనిపిస్తుంది అని చెపితే కరణ్ జోహార్ మహేష్ కు ‘మహర్షి’ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. అయితే సమంత కరణ్ జోహార్ లు చెప్పిన అభిప్రాయాలు కేవలం నమ్రత రిలీజ్ చేసిన వీడియోలో మాత్రమే కనిపిస్తున్నాయి కాని వారిద్దరి సోషల్ మీడియా పేజీలలో సమంత కరణ్ జోహార్లు ఇంకా షేర్ చేయకపోవడం వెనుక కారణం ఏమిటి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

సాధారణంగా సమంత కరణ్ జోహార్లు ఎప్పుడు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటారు దీనితో వారు ఏదైనా ఒక విషయం పై ఒక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు వెంటనే వారి సోషల్ మీడియా అకౌంట్ పేజీలలో వారి కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ‘మహర్షి’ వీడియోలో కనిపించిన సమంత కరణ్ జోహార్ ల ప్రశంసలు ఇంకా బయట కనిపించకపోవడంతో మహేష్ అభిమానులు వీరిద్దరి తీరు పై సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: