ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు మహేష్ ‘మహర్షి’ ప్రమోషన్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన విజయ్ ఈసినిమా ఘన విజయం తన పుట్టినరోజు సెంటిమెంట్ తో ఆధారపడి ఉంది అంటూ ‘మహర్షి’ విజయం తన పుట్టినరోజుకు మరింత జోష్ ఇస్తుంది అంటూ ముందుగానే జోస్యం చెప్పాడు. ఇలాంటి పరిస్థుతులలో విజయ్ ఈరోజు తన అభిమానుల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న బర్త్ డే ట్రక్ వార్తలకు సంబంధించిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

‘నవ్వును అందరికి పంచండి. ప్రేమను అందరితోను షేర్ చేసుకోండి. అన్నింటికీ మించి ఐస్ క్రీమ్ ను కూడ అందరికీ పంచండి’ అన్న స్లోగన్ తో ఈరోజు విజయ్ దేవరకొండ బర్త్ డే ట్రక్ మన తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్ విజయవాడ తిరుపతి వరంగల్ విశాఖపట్నంలలో సంది చేయబోతోంది. అంతేకాదు ఈ బర్త్ డే ట్రక్ బెంగుళూరు చెన్నై కొచ్చిన్ లలో కూడ సంది చేస్తూ విజయ్ కి దక్షినాది రాష్ట్రాలలో ఉన్న క్రేజీ స్టార్ ఇమేజ్ ని సూచిస్తోంది. 

ఈ బర్త్ డే ట్రక్ నిండా రకరకాల ఫ్లావర్స్ తో కూడిన ఐస్ క్రీమ్ లను విజయ్ తన బర్త్ డే గిఫ్ట్ గా తన అభిమానులకు పంపుతున్నాడు. గతః సంవత్సరం కూడ విజయ్ ఇలా ఐస్ క్రీమ్ ట్రక్ లను పంపినా ఈసారి వాటి పరిధి మరింత పెంచి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ పట్టణాలతో పాటు దక్షిణాదిలోని ప్రముఖ నగరాలను కూడ కవర్ చేస్తున్నాడు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాల నేపధ్యంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతోంది. వాస్తవానికి ఈమూవీ ఈ నెలాఖరుకు విడుదల కావలసి ఉన్నా ఈమూవీకి జరుగుతున్న రిపేర్ల రీత్యా జూలై 26 కు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ అభినందనలతో ‘మహర్షి’ సూపర్ హిట్ కావడంతో విజయ్ ‘డియర్ కామ్రేడ్’ మూవీకి మహేష్ అభిమానుల సపోర్ట్ పూర్తిగా లభించే ఆస్కారం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: