‘గీతాగోవిందం’ తర్వాత మరోసారి అదే కాంబినేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న మూవీ ‘డీయర్ కామ్రెడ్’. ఈ చిత్రం షూటింగ్ మొదలు మొన్నటి వరకు ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంటుంది. హీరో, హీరోయిన్ల మద్య లిప్ లాక్ సన్నివేశంపై విమర్శలు, షూటింగ్ ఆలస్యం, షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండకు ప్రమాదం...ఇలా ఎన్నో ఇబ్బందులతో పాలు రిలీజ్ డేట్ పై కూడా సస్పెన్షన్ కొనసాగుతూ వచ్చింది.
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం `డియర్ కామ్రేడ్`. `ఫైట్ ఫర్ వాట్ యు లవ్`. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేస్తున్నారు.
దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకే రోజున విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యంలో విడుదలైన సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.