హిట్టు సినిమానే కావాలంటే ఓ మాంచి మాస్ మసాలా కథతో.. అదిరిపోయే సాంగ్స్ తో సినిమా తీయొచ్చు.. మహేష్ బాబుకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో అలాంటి సినిమా తీసి హిట్టు కొట్టడం పెద్ద లెక్కేం కాదు. కాని కమర్షియల్ సినిమా చేస్తూ ఏదో ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచన తన ప్రతి సినిమాలో చేస్తున్నాడు మహేష్. శ్రీమంతుడు సినిమాలో ఊరి దత్తత కాన్సెప్ట్ ఎంత బాగా క్లిక్ అయ్యిందో తెలిసిందే.


సమాజంలో సమస్యల గురించి తన సినిమాలో ప్రస్థావిస్తే కొంతలో కొంత అయినా మార్పు వస్తుందని మన స్టార్స్ ఆలోచన. ఆ పంథాలో సూపర్ స్టార్ మహేష్ తన ప్రతి సినిమా ఓ అర్ధవంతంగా ఉండేలా చూస్తున్నాడు. స్టార్ క్రేజ్ వచ్చాక ఎలా తీసినా ఆడియెన్స్ చూసేస్తారులే అన్న ఆలోచన చేయకుండా తన సినిమా ద్వారా ఓ మంచి విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.


అందుకే మహేష్ తన ప్రతి సినిమాతో సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. భరత్ అనే నేనుతో ఓ లీడర్ అనేవాడు ఎలా ఉండాలో చూపించాడు. ఇక నేడు రిలీజ్ అవుతున్న మహర్షి ద్వారా రైతు కష్టాల గురించి.. గెలుపు ఓటముల గురించి ప్రస్థావించాడు. తాన్లు గెలవాలనుకునే వాడు మనిషి.. గెలుపుని పంచేవాడే మహర్షి అని లాస్ట్ పంచ్ ఏదైతే ఉందో ఇది చాలదు సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి అన్నట్టు ఉంది.


ఇక సోషల్ మీడియా అంతా మహర్షి.. మహర్షి అని అంతర్జాలం షేక్ అయ్యేలా మహేష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా హిట్టు కొడితే ఆ రీ సౌండ్ ఎలా ఉంటుందో మహర్షి చూపించబోతుంది. సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్, పివిపిలు మహర్షి హిట్ పై రిలీజ్ ముందునుండి ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. అదే ఇప్పుడు ప్రూవ్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: