తెలుగు ఇండస్ట్రీలో శ్రీమంతుడు తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు..గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’లాంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు.  తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’చిత్రంలో నటించారు.  ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు రకాల వేరియేషన్స్ లో నటించారట..కాలేజ్ స్టూడెంట్, బిలీనియర్, రైతు పాత్రల్లో దుమ్మురేపారట. 


ఈ చిత్రం రైతు సమస్యలపై అద్భుతంగా చిత్రీకరించినట్లు ప్రివ్యూ టాక్ ద్వారా తెలుస్తుంది.  ఇక మహేష్ బాబు నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అవుతారట.  ఈ చిత్రంలో మహేష్ బాబు కొట్టిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం...


  ఏంటో గాల్లో ఆక్సిజన్ తగ్గినట్టు మనుష్యుల్లో హ్యూమానిటీ తగ్గిపోతుంది

ఏలేద్దామనుకుంటున్నాను సార్ ... ప్రపంచాన్ని ఏలేద్దామనుకుం టున్నాను.

రెండు సబ్జక్ట్స్ కే చనిపోతావా ? ఎవడి బలం వాడిదే ... నీ బలం ఏంటో తెలుసుకో దీనెమ్మ జీవితం నీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది

రిషి నేను హుస్సేన్ బోల్టు ను చూసేసాను ... నిన్ను చూడాలనుకుంటున్నాను ... పరిగెత్తు రిషి ... ఆగకుండా

ఇప్పటి వరకూ నువ్వేమనుకున్నావో అది చేశావు... ఇప్పుడు నీ మనసేం చెప్తే అది చేయ్‌... నువ్వు గెలుస్తావు రిషి

సార్ మీరు ఇంగ్లీష్ దొర లాగా ఉంటారు... పల్లెటూళ్ళో ఎండలు ఎక్కువ జాగ్రత్త.

అలాంటోడు మన జీవితంలో ఉండాలంటే అదృష్ఠం ఉండాలి సార్ ... మరి మీకు ఆ అదృష్ఠం ఉందా ?

ఈడెవడో సూటు వేసుకున్న శకునిలాగా వున్నాడే ?

ఒకసారి ఏసి రూములో కూర్చుని కుదరదన్నావ్... చెట్టు క్రింద కొచ్చావ్... ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతావో ఆలోచించుకో వివేక్

— భారతదేశాన్ని రాజకీయ నాయకులు పాలిస్తారనుకుంటారు ... కానీ కార్పొరేట్ కంపెనీలే పాలిస్తారు.

ఓడిపోతామన్న భయంతో ఆటమొదలెడితే ... ఆటలో ఎప్పుడూ గెలవం. చెప్పా కదా ఆఖరు పేజిలో నా ఫోన్ నెంబరు ఉంది... కాల్ చెయ్యండి.

 ఒక ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు... మరి రైతు ఏడిస్తే దేశానికి మంచిదా ?

— సాఫ్టువేర్ అన్నారు కదరా ?

   నాకొడుకయ్యా ఈ భూమి నాదనేది... ఇది నా భూమి.... నాది... ఎవ్వడైనా లాక్కోవాలని చూస్తే ...

—  రైతును కాపాడడం ప్రభుత్వ భాధ్యతే కాదు... మనందరిదీ ... మనలోని ప్రతి వాళ్ళది.




మరింత సమాచారం తెలుసుకోండి: