ప్రస్తుతం తెలుగు సినిమాల ఫలితాలు యూఎస్ ప్రీమియర్ షో టాక్ ను బట్టి ఆధారపడ్డదని చెప్పొచ్చు. అక్కడ ప్రీమియర్స్ తో హయ్యెస్ట్ కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతుందని ఓ లెక్క. అయితే కొన్ని సినిమాలకు అక్కడ కలక్షన్స్ కు ఇక్కడ కలక్షన్స్ కు చాలా తేడా ఉంటుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో సూపర్ క్రేజ్ ఉంటుంది. అందుకే మహేష్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడవుతాయి.


ఇక లేటెస్ట్ గా మహేష్ మహర్షి సినిమా కూడా యూఎస్ లో భారీ సంఖ్యలో రిలీజైంది. ఓవర్సీస్ లో ఎప్పుడు లేనిది 2500 పైగా మహర్షి ప్రీమియర్ షోస్ వేయడం జరిగిందట. ఆ రేంజ్ లో ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి నాన్ బాహుబలి రికార్డులు బద్ధలు కొట్టడం గ్యారెంటీ అనుకున్నారు. అంతేకాదు ప్రీమియర్స్ ద్వారానే 2 మిలియన్ మార్క్ దాటేస్తుందని అంచనా వేశారు.


కాని అంచనాలు తారుమారై యూఎస్ లో మహర్షి ప్రీమియర్స్ లో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. మహర్షి సినిమాను గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ వారు రిలీజ్ చేశారు. 250 లొకేషన్స్ లో మహర్షి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ప్రీమియర్స్ ద్వారా 224 లొకేషన్స్ వరకు 503కె డాలర్స్ వసూళు చేశాయట. అంటే హాఫ్ మిలియన్ అని తెలుస్తుంది. అయితే మొత్తం ఏరియాలు కలిపినా 2 మిలియన్ పక్కన పెడితే 1 మిలియన్ క్రాస్ చేయడం కష్టమని అంటున్నారు. అయితే ప్రీమియర్స్ తో రికార్డ్ కొట్టాలని అనుకున్న మహర్షికి చేదు అనుభవం ఎదురైంది. 


యూఎస్ లో ప్రీమియర్స్ టాప్ సంపాదించిన వాటిలో మహర్షి 16వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ 12 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన మహర్షి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: