మహర్షి సినిమా ఈ రోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన రాబట్టుకుంటోంది. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే దిల్ కుష్ అనే చెప్పాలి. మహేష్ బాబు, కాలేజ్ కుర్రాడిగా, ఇక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా, మరియు బాధ్యత గల రైతు పాత్రలలో టాలీవుడ్ జనాలను తెగ మెప్పించేశారు.

అయితే ఇక్కడ సినిమా గురించి కంటే బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులు ఎలా ఉంటాయి అనే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. అందరూ ఒక మాట మీదకి వచ్చేశారు కూడా. మామూలుగా ఇండస్ట్రీలో వైవిధ్యభరిత చిత్రాలు లేదా ఎక్స్పెరిమెంటులు చేసే ఏకైక స్టార్ హీరో గా మహేష్ కు పెట్టింది పేరు. కమర్షియల్ పంథా నే నమ్ముకోకుందా సబ్జెక్ట్ బాగుంటే ఎంత రిస్క్ అయినా తీసుకునే తత్వం మహేష్ ది.

అయితే గత కొద్ది సినిమాల్లో మహేష్ లో ఆ ధోరణి కనపడలేదు. శ్రీమంతుడు దగ్గరనుండి మహేష్ సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అతను కొంచెం కొత్తగా “స్పైడర్” ట్రై చేసినా అది కాస్తా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడం తో ఇక బాబు సోషల్ మెసేజ్ ఇచ్చే ఎమోషనల్ ఫార్మాట్ నే నమ్ముకున్నట్లు స్పష్టం అయిపోతోంది. ఇక అతని తర్వాతి సినిమాలు అన్నీ “భరత్ అనే నేను”, “మహర్షి” మంచి కమర్షియల్ హంగులతో, సోషల్ మెసేజ్ తో రూపుదిద్దుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: