“అల్లరి” నరేష్…. ఈ పేరు మన టాలీవుడ్ సినీ జనాలు విని చాలా రోజులు అయిపోయింది. గత కొద్ది కాలంగా నరేష్ దగ్గర నుండి చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటీ రాలేదు. వరుస అట్టర్ ఫ్లాపులతో ఇక కనుమరుగు ఖాయం అనుకుంటున్న దశలో మహేష్ బాబు 25 వ సినిమాలో ఒక సరికొత్త పాత్రలో కనిపించి తనలో ప్రతిభ ఇంకా చావలేదు అని నిరూపించుకున్నాడు.

ఒకప్పుడు వరుసగా కామెడీ సినిమాలు చేసి ఎన్నో హిట్లు కొట్టిన నరేష్, అతి కొద్ది వ్యవధి లోనే 50 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. కానీ కొత్త పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని మన “అల్లరి” నరేష్, మహర్షి లో కూడా అతి కీలక పాత్ర పోషించారు. కాలేజ్ ఎపిసోడ్ లో అయితే ఒక మంచి స్నేహితులు అంటే ఇలా ఉండాలి అని అనుకునేలా మహేష్ – నరేష్ నటన ఉంది అంటే అతిశయోక్తి కాదు.

ఇక సెకండ్ హాఫ్ లో అయితే నరేష్ ను ఎంత పొగిడినా తక్కువే. దాదాపు ఇంటర్వెల్ తరువాత భాగం మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది అంటే ఇక నరేష్ పాత్ర కి ఉన్న విలువ గురించి చెప్పకర్లేదు. చిత్రం మొదటి నుండి చివరాకరు వరకు తనదైన శైలి లో అమాయకత్వం, సందర్భానుసారంగా అవలీలగా హావాభావాలు పలికించి మళ్లీ మనకు తెలిసిన “అల్లరి” నరేష్, మహర్షి విజయంలో కీలక భూమిక పోషించారు అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: