సూపర్ స్టార్ మహేష్ కు కరెక్ట్ సినిమా పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఏదో ఒక సినిమా చేసేద్దాం అనుకుంటే ఎలాగైనా చెయూచ్చు కాని సమాజానికి ఏదో ఒక విషయాన్ని చెప్పాలన్న బాధ్యతతో సినిమా చేయడం చాలా కష్టం. అందుకే మహేష్ ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇక నిన్న రిలీజైన మహేష్ మహర్షి మూవీ అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.


ఇక మహేష్ స్టామినా ప్రూవ్ చేస్తూ అన్ని చోట్ల కలక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. సినిమా 96 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా అన్నిచోట్ల మొదటిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా మహర్షి మొదటి రోజు 60 కోట్ల గ్రాస్ అంటే 30 కోట్ల పైగా షేర్ రాబట్టిందని అంచనా వేస్తున్నారు. ఇంకా కలక్షన్స్ కు సంబందించిన ఏరియా వైజ్ పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది.


మహర్షి సినిమాపై ముందునుండి అంచనాలు పెరిగాయి.. మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో మరోసారి తన నటనా ప్రతిభ కనబరిచాడు. మహేష్ లుక్స్, స్టైల్. యాటిట్యూడ్ ఇవన్ని సినిమాలో హైలెట్ అంశాలుగా చెప్పొచ్చు. మహేష్ తో పాటుగా అల్లరి నరేష్ కూడా మంచి రోల్ చేశాడు. సినిమాలో రవి పాత్ర చేసిన అల్లరి నరేష్ కూడా చాలా బాగా మెప్పించాడు.


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్స్ లో కన్నా బిజిఎం లో బాగా వర్క్ అవుట్ అయ్యింది. మొత్తానికి మహర్షి సినిమా మహేష్ ఏదైతే రిజల్ట్ ఊహించాడో దానికి తగినట్టుగానే వచ్చింది. కొంతమంది రొటీన్ సినిమా.. అన్ని సినిమాలను మిక్స్ చేశాడని చెబుతున్నా ఇప్పట్లో స్టార్ సినిమాలేవి లేవు కాబట్టి కచ్చితంగా మహర్షి మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: