‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుండి అనుకున్నట్లుగా ఏదీ జరగకపోవడం రాజమౌళికి టెన్షన్ గా మారింది. ఈమూవీ షూటింగ్ ప్రారంభం అయిన తరువాత చరణ్ జూనియర్లకు గాయాలు తగలడం దగ్గర నుండి ఈసినిమాకు హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎదురైన సమస్యలు ఏకంగా రాజమౌళికే షాక్ ఇస్తున్నట్లు టాక్. 

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా కేవలం ఇప్పటి వరకు అలియా భట్ ఎంపిక మాత్రమే పూర్తి అయింది. బ్రిటీష్ బ్యూటీ డైసీ ఈమూవీ నుండి తప్పుకోవడంతో రాజమౌళి ఆమె స్థానం విషయమై ఇంకా ఎటువంటి స్థిర నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు దురదృష్టంలో అదృష్టంగా అలియా భట్ మారబోతోందా అన్న సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో అలియా భట్ పాత్రను ఇంచుమించు హీరోలతో సమానంగా రాజమౌళి పెంచుతున్నట్లు టాక్. మొదట్లో చరణ్ పక్కన మూడు పాటలు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేద్దాము అనుకున్న అలియా భట్ పాత్ర పరిధిని ఇప్పుడు రాజమౌళి పూర్తిగా పెంచుతున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం బాలీవుడ్ మార్కట్ లో అలియా భట్ కు ఉన్న క్రేజ్ రీత్యా ‘ఆర్ ఆర్ ఆర్’ మార్కెట్ కు బాలీవుడ్ లో ఎటువంటి సమస్యలు లేకుండా ఇలాంటి నిర్ణయం రాజమౌళి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తన పాత్ర నచ్చితే ప్రాణం పెట్టి నటించే అలియా భట్ మనస్తత్వం రీత్యా ఆమె డేట్స్ విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అలియా భట్ ను తెలివిగా బుట్టలో వేసుకోవడానికి రాజమౌళి ఈ వ్యూహాలు అనుసరిస్తున్నట్లు టాక్



మరింత సమాచారం తెలుసుకోండి: