టాలీవుడ్ లో అప్పట్లో ‘చిత్రం’సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి..జయం, నిజం ఇలా కొన్ని సెన్సేషనల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజ.  ఆ తర్వాత కొన్ని ఫ్లాపు సినిమాలు రావడంతో కొంత కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ మద్య రానా హీరోగా ‘నేనే రాజు..నేను మంత్రి’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  దాంతో తేజ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు.  అయితే ఎన్టీఆర్ బయోపిక్ కూడా మొదట తేజనే అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నారు. 


తాజాగా తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆమె జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. ఇక విలన్ గా సోనూసూద్ కనిపించనున్నాడు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.  ఫైటింగ్‌, యాక్సిడెంట్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతున్నట్లు ప్రారంభం అయ్యింది.  


ఈ ట్రైలర్ లో ఎమోషన్, సెంటిమెంట్, ఫైట్స్ అన్నింటిని సమ్మిళతం చేసినట్లు కనిపిస్తుంది దర్శకులు తేజ.  ఇక వరుసగా మాస్‌ సినిమాలు చేస్తూ సక్సెస్‌ కోసం పోరాడుతున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఇన్నాళ్లు మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నించినా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో ఇప్పుడు రూట్ మార్చి ఓ లేడి ఓరియంటెడ్‌ సినిమా చేశాడు.


ఈ ట్రైలర్ లో  ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.  ఈ సినిమాలో మరో హీరోయిన్ గా  మన్నారా చోప్రా  నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: