టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సినిమాల‌కు ఎంత గొప్ప హిట్ టాక్ వ‌చ్చినా అదే రేంజ్‌లో వ‌సూళ్లు ఉండ‌డం లేద‌న్న కంప్లెంట్లు ఉంటున్నాయ్‌. శ్రీమంతుడు సినిమాకు వ‌చ్చిన టాక్‌తో పోలిస్తే వ‌సూళ్లు త‌క్కేవే అన్నారు. ఇక భ‌ర‌త్‌కు హిట్ టాక్ వ‌చ్చినా లాంగ్ ర‌న్‌లో ఎంతో కొంత లాస్ త‌ప్ప‌లేదు. ఇక బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్‌లు డిజాస్ట‌ర్ల‌తో భారీ న‌ష్టాలు మిగిల్చాయి. ఇక తాజాగా వ‌చ్చిన మ‌హ‌ర్షి సినిమా ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌ల అయినా సినిమాకు ఆశించిన రేంజ్‌లో క‌లెక్ష‌న్లు రాలేదంటున్నారు.


ఇక ఓవ‌ర్సీస్ మార్కెట్ అంటే మ‌హేష్‌కు కొంగు బంగార‌మే. అది కొద్ది రోజులుగా డౌన్ అవుతూ వ‌స్తోంది. క్ర‌మ‌క్ర‌మంగా ఇత‌ర హీరోలు ఇక్క‌డ మార్కెట్ పెంచుకుంటుంటే మ‌హేష్ మార్కెట్ మాత్రం డౌన్ అవుతోంది. మ‌హ‌ర్షి అక్క‌డ ప్రీమియ‌ర్ల‌తో కేవ‌లం  $ 500K మాత్రమే రాబట్టడం అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ వ‌సూళ్లు ఐదారేళ్ల క్రితం మ‌హేష్ ప్లాప్ సినిమాల‌కు కూడా వ‌చ్చాయ్‌. 


ఐదారేళ్ల‌కు, ఇప్ప‌ట‌కీ టిక్కెట్ల రేట్లు ఎంతో పెరిగాయ్‌. మార్కెట్ పెరిగింది... బిజినెస్ పెరిగింది. అయినా ఇప్పుడు ఐదారేళ్ల నాటి ప్లాప్ సినిమాల వ‌సూళ్ల కంటే స‌గం మాత్రమే రావ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. పోనీ మ‌హ‌ర్షి గురువారం వ‌చ్చింది క‌దా అని స‌రిపెట్టుకోవ‌డానికి లేదు. మ‌హాన‌టి, గీత‌గోవిందం లాంటి సినిమాలు వీక్ డేస్‌లోనే వ‌చ్చి... స్టార్లు లేకుండానే మంచి వ‌సూళ్లు రాబ‌ట్టాయి.


ఏదేమైనా మ‌హేష్ ఎంచుకునే క‌థ‌ల్లో లోపమో ?  లేదో ?  ఓవ‌ర్సీస్ ఫ్యాన్స్ స్టార్ల‌ను గుడ్డిగా న‌మ్మ‌డం లేద‌నో అనుకోవాలో ?  గాని మ‌హేష్ ఓవ‌ర్సీస్ మార్కెట్ డ‌ల్ అవుతున్న‌ట్టే. మ‌హేష్ ఎప్పుడూ ఓ మ‌ల్టీమిలియ‌నీర్ క్యారెక్ట‌ర్ల‌లా మూస ప‌ద్ధ‌తిలో కాకుండా చెర్రీ, ఎన్టీఆర్‌లా భిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌ను ఎంచుకోవాల‌ని ఈ సినిమా చెప్ప‌క‌నే చెప్పింది. లేక‌పోతే ఇటు ఓవ‌ర్సీస్‌లోనే కాకుండా అటు ఏపీ, తెలంగాణ‌లోనూ మ‌నోడు హిట్ కొట్టినా అనుకున్న రేంజ్‌లో క‌లెక్ష‌న్లు రాక‌పోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: