మెగాస్టార్ చిరంజీవి తెలుగులో టాప్ స్టార్. మరి బాలీవుడ్ కి మెగా స్టార్ అమితాబ్ బచ్చన్. ఆయన జీవితాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు అమితాబ్ కి ప్రభావం అవుతారు. అమితాబ్ హిందీ సినిమాలు తెలుగులో అప్పట్లో అన్న నందమూరి చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఇక టాలీవుడ్లో అమితాబ్ అంటే అడ్మైర్ అయ్యే వారు ఎంతో మంది ఉన్నారు. 


తానే ఓ ట్రెండ్ సెట్టర్ ఐన చిరంజీవి అమితాబ్ ను ఫాలో అవడమేంటి అన్న ఎవరికైనా  డౌట్స్ రావచ్చు. కానీ అది నిజం. అయితే సినిమాల్లో కాదు, రాజకీయాల్లో అమితాబ్ చిరుకు ఇపుడు ఆదర్శంగా మారారు. అపుడెపుడో అమితాబ్ తన  మిత్రుడు రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ ఎంపీగా అలహాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని సినిమాలతోనే తన జీవితం గడిపేస్తున్నారు.


ఇపుడు చిరు కూడా అంతేనట. ఇక రాజకీయాల జోలికి రానే రారట. ఆయన కూడా సినిమాలతోనే తన జీవితాన్ని పూర్తిగా గడిపేయాలనుకుంటున్నారుట. ఈ సంగతి ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో ఆయన తమ్ముడు నాగబాబు చెప్పారు. చిరంజీవి రాజకీయ జీవితం కంటే సినిమా జీవితం పైనే ఆయన ద్రుష్తి పెట్టారని నాగబాబు చెబుతున్నారు. మరి అది నిజనే కావచ్చునేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: