సమంత అందగత్తె. చక్కని అభినయం కలిగిన నటి. ఆమె ఎందరికో కలల రాకుమారి. పెళ్ళి అయినా కూడా సమంతా ఇంకా వెండి తెరపై తన సత్తా చాటుతూ కుర్ర గుండెలను గిల్లిపోతోంది. అటువంటి సమంతా టాలీవుడ్ కి కూడా హాట్ ఫేవరేట్ అనడంలో సందేహం లేదు. ఆమె తెలుగులో అందరి టాప్ స్టార్స్ తోనూ నటించింది. అలాగే ఎన్నో హిట్స్ కొట్టింది


మరి రవితేజాకు సమంతకు రిలేషన్ ఏంటి అన్న‌దే కదా డౌట్. నిజమే రవితేజాతో సమంత నటించలేదు కానీ ఆమె తెగ డిస్టర్బ్ చేస్తోందిట. రవితేజా ఇపుడు డిస్కో రాజా మూవీ చేస్తున్నాడు. చాలా మూవీస్ వరసగా ఫట్ అవుతూంటే రవితేజా మంచి కాన్సెప్ట్ తో  ఉన్న ఈ మూవీకి సైన్ చేశాడట. తప్పకుండా హిట్ కొడతామన్న నమ్మకంతో ఉన్నాడని టాక్.


అయితే ఈ సినిమాలో కధకు, సమంత చేసే బేబీ సినిమా కధకు మధ్య బాగా పోలికలు ఉన్నాయట. సమంత మూవీ కూడా ఇపుడు జోరుగా సాగుతోంది. దాంతో రవితేజా టీం కలవరపడుతోందట. సమంత మూవీ తో క్లాష్ అయితే తమ సినిమా సక్సెస్ రేట్ తగ్గిపోతుందేమోనని టెన్షన్ పడుతున్నారుట. అందువల్ల డిస్కో రాజా షూటింగ్ ని నెమ్మదిగా చేస్తున్నారుట. సమంత బేబీ మూవీ  ముందు రిలీజ్ అయితే అందులో కంటెంట్ ని చూసి తమ మూవీలో మార్పులు చేసుకోవాలనుకుంటున్నారుట. మొత్తానికి సమ్మూ తెరపై నటించి కుర్ర కారునే కాదు. సాటి హీరోలనూ కలవరపెట్టేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: