యాంకర్ రేష్మి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక పక్క బుల్లితెరపై మరో పక్క వెండితెరపై సక్సెస్ ఫుల్లుగా రాణిస్తూ పెద్ద సెలబ్రిటీ గా మారిపోయింది. ముఖ్యంగా జబర్దస్త్ వంటి షోలలో అమ్మడు రేష్మి అందాలకు ఆమె వేసుకున్న దుస్తులకు తెలుగు కుర్రకారు ఎంతగానో ఫిదా అవుతారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ నేపథ్యంలో ట్విటర్లో రేష్మి కి ఓ అభిమాని వింత కోరిక కోరాడు.

Image result for reshmi hot

సదరు అభిమాని కోరుకున్నది ఏమిటంటే రేష్మి గారు గుడ్ మార్నింగ్. నాదో చిన్న కోరిక. ఈ రోజు నా బర్త్ డే. మీ నుంచి నేను విషెస్ కోరుకొంటున్నాను. మీరు నా పేరును పేర్కొంటూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపండి. మీరు విషెస్ తెలియజేయకుంటే జీవితంలో ఈ రోజుకు అర్ధం ఉండదు. నా బర్త్ డే అసంపూర్తిగానే గడచిపోతుంది. థ్యాంక్యూ మామ్ అంటూ మెసేజ్ పెట్టారు.

Related image

అభిమాని కోరికకు ర‌ష్మి స్పందించారు. కానీ అభిమాని పేరు చెప్పకుండా హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పారు. అభిమాని పేరుతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఉంటే బాగుండేదేమో అనే వాదన సోషల్ మీడియాలో వినిపించింది. కాని అభిమానికి రష్మి విషెస్ చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: