బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ డేట్స్ కోసం ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నీ ఎదురు చూస్తున్నాయి. దీనికితోడు ఆమె ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ తో కలిపి నాలుగు సినిమాలను అంగీకరించడంతో ఆమె డేట్స్ షెడ్యూల్ లో ఒక్కరోజు తేడా వచ్చినా అన్ని సినిమాల షూటింగ్ లు గందరగోళంలో పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో బాలీవుడ్ మీడియా అలియా భట్ కు సంబంధించి బయటపెట్టిన ఒక సీక్రెట్ బాలీవుడ్ నిర్మాతలనే కాకుండా రాజమౌళికి కూడ టెన్షన్ పెడుతున్నట్లు సమాచారం. 

అలియా భట్ బాలీవుడ్ చాక్లెట్ బోయ్ గా పిలవబడే రణబీర్ తో ప్రేమలో మునిగిపోవడమే కాకుండా అతడితో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ ఆడుతున్న ఒక సీక్రెట్ గేమ్ ను బాలీవుడ్ మీడియా బయటపెట్టింది. అలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి ప్రస్తుతం ఇటలీలోని లేక్ కోమోకి వెళ్లి సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తున్నారని అక్కడేవాల్లిదరు పెళ్లి చేసుకుని తిరిగి వస్తారని బాలీవుడ్ మీడియా వార్తలు గుప్పుమంటున్నాయి. 

ఈ వార్తల పై వాస్తవాలు తెలుసుకుందామని కొందరు బాలీవుడ్ నిర్మాతలు అలియా భట్ తల్లి  సోనీ రజ్ధానీని ప్రశ్నిస్తే ఆమె తన కూతురు స్వేచ్చకు భంగం కలిగించననీ ఆమె ఆలోచనలు గౌరవిస్తానని చెప్పడం బట్టి అలియా రణబీర్ కపూర్ ల పెళ్లి ఇటలీలో జరిగిపోతోందా అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.  ఈవార్తలకు మరింత బలం చేకూరుస్తూ  అలియా తన జాలీ ట్రిప్ కు సంబంధించి కొన్ని ఫోటోలను లీక్ చేసింది. సముద్ర తీరంలో బికినీ వేసుకుని హాలిడేను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఆమె షేర్ చేసిన ఫోటోలను బట్టి ఆమె ప్రస్తుతం రణబీర్ కపూర్ తో హాలిడేను ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని పరోక్షంగా బయట పెట్టింది. 

సూర్యుని కిరణాల తాకిడితో తళతళా మెరుస్తున్న అలియా గ్లామర్ కు సంబంధించిన ఈఫోటోలు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ మారాయి. దీనితో అలియా నిజంగానే రణబీర్ ను పెళ్లి చేసుకుంటే ఆమె ఇప్పట్లో ఆ హాలిడే మూడ్ నుండి బయటకు రాలేకపోవచ్చనీ దానివల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ తో సహా అలియా భట్ ఒప్పుకున్న సినిమాల షూటింగ్ డేట్స్ కు సమస్యలు ఏర్పడతాయి అంటూ బాలీవుడ్ మీడియా రాస్తున్న కథనాలు రాజమౌళికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి అని టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: