తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది మెహ్రీన్. రాజ ది గ్రేట్ సినిమా తరువాత ఏఫ్ 2తో బ్లాక్ బస్టర్ కూడా కొట్టింది. మెహ్రీన్ ఫిట్నెస్ మీద అప్పట్లో ఎంతో మంది కామెంట్ చేసారు. తన శరీర భరువు కారణము చేత మెహ్రీన్ చాలా అవకాశాలనే వదులుకుంది. ఈ ఏడాది ఏఫ్ 2తో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టిన మెహ్రీన్ చేతిలో ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా లేదు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా మెహ్రీన్ కు నిరాశే మిగిలింది.


మెహ్రీన్ చిన్నపాటి హిందీ చిత్రాలలో కూడా కనిపించింది అయితే బాలీవుడ్ లో కూడా తన స్థానాన్ని సంపాదించుకోలేకపోయింది. ఇటివలే గోపీచంద్ నటిస్తున్న తిరు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో ఆఫర్ ని కూడా పట్టేసింది అని సమాచారం.

Image result for mehreen images

యంగ్ హీరో నాగ సౌర్య ఒక కొత్త దర్శకుడుతో సినిమా చేయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆ సినిమా ఒక రొమాంటిక్ సినిమాగా ఉండబోతుందని టాక్. ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ పాత్రలో కనిపించాబోతుందట. విశేషం ఏంటి అంటే నాగ శౌర్య సొంత బ్యానేర్ ఐరా క్రియేషన్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం శౌర్య, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నటిస్తున్నాడు.


ఈ సినిమా పూర్తి అయ్యిన తరువాత, శౌర్య సొంత బ్యానర్ లో సినిమా మొదలుపెడదామని అనుకుంటున్నాడట. అయితే శౌర్యకి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. చేసిన కొన్ని సినిమాలైన శౌర్యకి మంచి పేరు తెచ్చిపెట్టాయనే చెప్పుకోవచ్చు. శౌర్య చేతిలో పెద్ద హిట్ లు లేకపోయినా ఒక సుమారు హిట్ లతో ముందుకు వెళ్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: