అల్లు శిరీష్, అల్లు అరవింద్ తనయుడు, బన్ని తమ్ముడు అనే పేరు నుండి సొంతంగా తనకుంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చా అంటూ గౌరవం సినిమాతో పరిచయం అయిన అల్లు శిరీష్ తన అన్నయ్య లాగా ఇప్పుడున్న యువ హీరోలతో పోటి పడేలేకపోయడనే చెప్పొచ్చు. ఇంకా యాక్టింగ్ లో పరిణితి రావాలని చాల మంది టాక్.


అల్లు శిరీష్ కి ఇప్పటి వరకు చెప్పుకునంత పెద్ద హిట్ లేదు, తన కెరీర్ లో “శ్రీరస్తు శుభమస్తు” సినిమానే అన్నిటి కంటే మంచి పేరు ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో యాక్టర్ గా కూడా శిరీష్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆ సినిమా తరువాత శిరీష్ కు మరల మునపటి రోజులే వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క హిట్ కుడా తగలలేదు కానీ మనోడు మాత్రం ప్రయత్నాలు ఆపలేదు.

Image result for allu sirish images

తాజాగా అల్లు శిరీష్ “ఏబిసిడి” అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడాని రెడీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 17వ తేదిన విడుదల కానుంది. ఈ సినిమా చాల వాయిదాలు తరువాత ఈ 'మే'లో విడుదలకు సిద్ధమయ్యింది. ముందు సమ్మర్ రేస్ లో కాకుండా జూన్ నెలలో ఈ సినిమా విడుదల చేద్దాం అని మేకర్స్ అనుకున్నారట. కానీ మరల మనసు మార్చుకొని ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ 17వ తేదీనే రిలీజ్ అంటూ హల్ చల్ చేసారు.


ఈ సినిమా మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసారు, అదే సినిమాను తెలుగులో రీమేకింగ్ చేసారని వినికిడి. సంజీవ్ అని కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వార మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా అల్లు శిరీష్ కెరీర్ కి చాల కీలకమైనదే అని చెప్పాలి. లేదంటే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మొత్తానికి అల్లు శిరీష్ హిట్ కొడతాడో లేదో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: