వరుణ్ తేజ్ హీరోగా అప్పట్లో 'కొత్త బంగారులోకం' సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుగుపెట్టాడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారులోకం సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బ్లాక్ బస్టర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తో వెంకటేష్ - మహేష్ బాబు లను డైరెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మెగా కాంపౌండ్ హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు.

Image result for srikanth addala

అప్పటిదాకా కెరీర్ మంచి ఊపుమీద తీసుకెళ్లిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డా కి...మహేష్ బాబు తో తీసిన బ్రహ్మోత్సవం సినిమా తో శ్రీకాంత్ అడ్డాల కెరియర్ మొత్తం అడ్డం తిరిగిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యంత ఘోరమైన ఫ్లాప్ సినిమాగా నిలిచిపోయింది. దీంతో అప్పటివరకు శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేద్దామని అనుకున్న చాలామంది..బ్రహ్మోత్సవం ఫ్లాప్ టాక్ తో శ్రీకాంత్ అడ్డాల తో సినిమా అంటే వెనకడుగు వేయడం మొదలుపెట్టారు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు. అయితే ఈ క్రమంలో చాలా కాలం తర్వాత శ్రీకాంత్ అడ్డాల కి అతి కష్టం మీద మెగా కాంపౌండ్ లోకి వచ్చి చేరాడు.

Image result for srikanth addala nani

పరశురాం లాంటి దర్శకుడుకి ఛాన్స్ ఇచ్చి గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ తో మళ్ళీ క్రేజీ దర్శకుడుగా మార్చిన గీతా ఆర్ట్స్ ఇప్పుడు శ్రీకాంత్ తో సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో నాని ని హీరోగా పెట్టి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేత సినిమా నిర్మించే పనిలో పడింది గీతా ఆర్ట్స్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పై గట్టిగా కసరత్తు చేస్తున్నారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ ఇండస్ట్రీలో జెర్సీ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాలతో తర్వాత సినిమా అనే బతికి చాలామంది షాక్ లో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. మరోపక్క బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ తర్వాత తాజాగా కొత్త సినిమా ఓకే అవడంతో ఊపిరిపీల్చుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల.




మరింత సమాచారం తెలుసుకోండి: