మెగాస్టార్ చిరంజీవిపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి తన సినిమాల వరకు ఎవరూ కష్టపడనంతగా కష్టపడతారని కితాబిచ్చారు. అదే సమయంలో ఓ విమర్శ కూడా చేశారు. చిరంజీని ఎంత వరకు చేయగలరో అంతా చేస్తారని, కానీ అంతకుమించి ఆలోచించే శక్తి ఆయనకు లేదని తమ్మారెడ్డి అంటున్నారు. 


ఈ లక్షణం వల్లే చిరంజీవి ఇతరులపై ఆధారపడతారని తమ్మారెడ్డి అంటున్నారు. ఈ లక్షణం రాజకీయాలకు అస్సలు సరిపడదన్న తమ్మారెడ్డి.. అందుకే చిరంజీవి రాజకీయాల్లో రాణించలేదని విశ్లేషించారు. ఒకప్పుడు సినిమాల్లో నంబర్ వన్ గా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆ గౌరవానికి దూరమయ్యారని తమ్మారెడ్డి కామెంట్ చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు తమంతట తాము ఆలోచించుకుని రావాలని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ లక్షణం చిరంజీవిలో లేదన్న ఉద్దేశంతోనే తాను గతంలో చిరంజీవి రాజకీయాలకు పనికిరాడని వ్యాఖ్యానించానని తమ్మారెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చారు. 

అంతేకాదు.. ఈ సినిమాల తీరుపైనా తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇప్పుడు ఎలాంటి చిత్రం తీసినా చూస్తారని, అలాంటి వ్యక్తి 'అమ్మడూ కుమ్ముడూ' అనాల్సిన అవసరం లేదని విమర్శించారు. చిరంజీవి తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయాలని తమ్మారెడ్డి  సూచించారు. చిరంజీవి ట్రెండ్ ను ఫాలో అవడం కంటే  ట్రెండ్ సెట్ చేస్తేనే బాగుంటుందని తమ్మారెడ్డి సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: