'మహర్షి' మూవీలో రైతు కష్టాలను మాత్రమే కాకుండా వ్యవసాయం ప్రాధాన్యతను వివరిస్తూ రైతుకు గౌరవం ఇవ్వకపోతే రానున్న రోజులలో తినడానికి తిండి గింజలు పండించే వ్యక్తి ఉండడు అన్న సందేశాన్ని రిషి పాత్ర ద్వారా వంశీ పైడిపల్లి ఇప్పించాడు. అంతేకాదు హాలీడేస్ వీకెండ్స్ లో పబ్ లకు పార్టీలకు వెళ్లకుండా కనీసం వారానికి ఒక్కరోజైనా గ్రామాల బాటపట్టి రైతుకు భరోసా కల్పిస్తూ అతడు చేసే వ్యవసాయానికి సాయం చేస్తూ రైతుకు గౌరవం ఇమ్మని ఈమూవీలో అంతర్లీనంగా సందేశం ఇప్పించారు. 

ఇప్పుడు ఈ సందేశం మహేష్ వ్యక్తిగత జీవితానికి సమస్యగా మారబోతోంది. 'శ్రీమంతుడు' సినిమాలో గ్రామాలను దత్తత చేసుకోమని పిలుపు ఇస్తే ఎంతోమంది మహేష్ పిలుపుకు స్పందించి గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేష్ కూడ తాను తన 'శ్రీమంతుడు' లో చెప్పిన సందేశాన్ని అనుసరిస్తూ తన సొంత ఊరు బుర్రిపాలెం దత్తత తీసుకుని ఆఊరు అభివృద్ధికి ఎన్నో మంచి పనులు చేసాడు. 

ఇప్పుడు 'మహర్షి' మూవీలో మహేష్ రైతుగా మారిన నేపథ్యంలో అతడి నిజజీవితంలో కూడ రైతుగా రైతుల కష్టాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తాము కూడ వీకెండ్స్ లో రైతుల వద్దకు వెళ్ళి వారు చేస్తున్న వ్యవసాయానికి సహాయపడుతూ తమవంతు సహాయం అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ అనేకమంది సోషల్ మీడియాలో ద్వారా మహేష్ కు సందేశాలు పంపుతున్నారు.

అంతేకాదు తాను నటించే సినిమా సినిమాకు గ్యాప్ దొరికినప్పుడల్లా  అబుదాబి  ప్యారిస్ ఇతర యూరొపియన్ దేశాలకు వెళ్ళే అలవాటు ఉన్న మహేష్ తన అలవాటును మార్చుకుని తన ఖాళీ సమయంలో పల్లెటూరి బాటపట్టి నిజంగానే రైతులకు సంఘీభావం తెలుపుతూ వారికి వ్యవసాయంలో సహాయం చేయగలిగితే అది ఒక పెను విప్లంవంగా మారి మహేష్ చొరవతో రైతుకు నిజంగానే గౌరవం ఏర్పడుతుందని కొందరు చేస్తున్న సూచనలు నిజంగానే మహేష్ ఆలోచింప చేసి తీరుతాయి. 'మహర్షి' సినిమా ప్రభావంతో యూత్ లో వస్తున్న ఈ ఆలోచనలకు నిజంగానే మహేష్ వైపు నుంచి స్పందన వస్తే మహేష్ నిజమైన రియల్ హీరోగా మారిపోతాడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: