ఏఫ్ 2 విజయం తరువాత వరుణ్ తేజ్, వెంకటెష్ మంచి జోష్ లో ఉన్నారు. సినిమాల ప్రోమోషన్లకు, ట్రైలర్ రిలీజ్ కు ఆహ్వానాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా హాలీవుడ్ అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ డిస్నీ, గాయ్ రిట్చయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ‘అలాద్దీన్’. 'అలాద్దీన్' పాత్రను మనలో చాలమంది చిన్నపటి నుండి ఫాలో అయ్యుంటారు.


ఆ పాత్రతో చిత్రీకరించిన వీడియో గేమ్ కూడా అందరికి విదితమే. చిన్నారులకు యూత్ కు కూడా 'అలాద్దిన్' సినిమా అంటే చాల ఇష్టం అనే చెప్పాలి. అదే కధాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను నిన్న వరుణ్ తేజ్, వెంకటేష్ సంయుక్తంగా రిలీజ్ చేసారు. ఇందులో జీనిగా ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ నటించారు. అలాద్దిన్ గా మేనా మసూద్, ప్రిన్సు జాస్మిన్ గా నయోమి స్కాట్ అలరించనున్నారు.

Image result for venkatesh images

విశేషం ఏంటంటే జీని పాత్రకి టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా ఈ మే 24వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మెగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ నిజజీవీతంలో జీని లాంటి పాత్ర వచ్చి ఏదైనా కోరుకోమంటే ఈ వరల్డ్ లో అందరు హ్యాపిగా ఉండాలని కోరుకుంటా అని అయన అన్నారు.


అలానే వరుణ్ కు చిన్న పిల్లల స్టొరీ అంటే చాల ఇష్టం అట, వరుణ్ నిహారిక ఇద్దరు కలసి ఇలాంటి సినిమాలే చూసేవాళ్ళం అని తన చిన్ననాటి గుర్తులను నెమరు వేసుకున్నారు. వరుణ్ తేజ్ కి తను డబ్బింగ్ చెప్పిన క్యారెక్తర్ చాల నచ్చిందంట. ఏఫ్ 2, అల్లాద్దీన్ చాల డిఫరెంట్ సినిమాలు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం కొంచెం కష్టంగానే అనిపించింది అని ఆయన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: