తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మహేష్ బాబు దాదాపు 24 చిత్రాలు నటించారు.  ఈ మద్య హీరోయిజానికి కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.  శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను లాంటి చిత్రాల్లో డిఫరెంట్ పాత్రలతో మెప్పించారు.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’చిత్రం ఆయన కెరీర్ లోనే ఓ అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది. 

రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ షేక్ చేస్తుంది.  ఈ చిత్రం లో మహేష్ బాబు మూడు రకాల పాత్రల్లో నటించారు. కాలేజ్ స్టూడెంట్, బిలీనియర్, సామాన్య రైతు పాత్రలో అదరగొట్టారు.  నేడు  నోవాటెల్ హోటల్ లో  ‘మహర్షి’సక్సెస్ మీట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ..‘మదర్స్ డే’ అని, ‘నాకు అమ్మంటే దేవుడితో సమానం’ అని ప్రముఖ హీరో మహేశ్ బాబు అన్నారు.

తన చిత్రం రిలీజ్ కు ముందు తన తల్లి ఇచ్చే కాఫీ తాగుతానని, ఆ కాఫీ తాగితే గుడిలో ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుందని అన్నారు. ఆమె ఆశీస్సులు తనకు చాలా ముఖ్యమని, అందుకే తనకు విజయాలు దక్కాయని అన్నారు. ఎంతో గొప్ప బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రాన్ని తల్లులందరికీ అంకితం చేస్తున్నట్టు మహేశ్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: