మహేష్ బాబు కెరీర్ పాతిక సినిమాలు దాటింది. ఆయన మూవీస్ అన్నిట్లో   హిట్లు, ఫట్లు ఉన్నాయి కానీ పక్కా మాస్ మూవీ అన్నది ఒక్కటి లేదని అభిమానులలో అసంత్రుప్తి ఉంది. మహేష్ మాస్ మసాలా మూవీ  నటిస్తే చూడాలని ఎప్పటినుంచో కోరిక వారిలో ఉంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్  క్రిష్ణ మాస్ హీరోగానే ఎదిగి మూడు వందల యాభై మూవీస్ చేశారు. మహేష్ కూడా మాస్ హీరో అవుతారని అనుకున్నారంతా. అయితే తన రూటే సెపరేట్ అని మహేష్ మొదటి నుంచి వెళ్తున్నాడు.

 

ఇక తాజాగా మహర్షి మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా మీద మిక్సుడ్ టాక్ వస్తోంది. అంతే కాదు మహేష్ కొన్ని సినిమాల నుంచి రొటీన్ యాక్షన్ చెస్తూ  బోర్ కొట్టిస్తున్నాడని కామెంట్స్ కూడా వస్తున్నాయి.శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీ, ఇపుడు మహర్షి, మధ్యలో స్పైడర్ ఇలా మహేష్ ఒకే రకం యాటిట్యూడ్ తో తెరపైన కనిపిస్తున్నాడని అంటున్నారు. మహేష్ మారాలని, ఆయన మూవీస్ సెలెక్షన్ కూడా మారాలని అంటున్నారు.

 

ఇపుడున్న హీరోలంతా మాస్ మూవీస్ చేస్తున్న వారే. మహేష్ మాత్రం క్లాస్ టచ్ చెదరకుండా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. దాంతో ఆయన సినిమాలు బీ సీ టౌన్లలో ఫుల్ కలెక్షన్లు రాబట్టడం లేదని కూడా అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో కూడా మహేష్ క్రేజ్ తగ్గడానికి మూస సినిమాలు చేయడమే కారణమని అంటున్నారు. అపుడెపుడో పోకిరీ మూవీలో మహేష్ కాస్త మాస్ టచ్ ఇచ్చాడు. ఆ తరువాత మళ్ళీ లేదు. అదే కంటిన్యూ చేసి ఉంటే మహేష్ దూసుకుపోయేవాడని అనే వారూ ఉన్నారు. ఏది ఏమైనా మహేష్ పక్కా మాస్ మూవీ  చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. చూడాలి మరి మన్నిస్తాడో లేదో.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: