బాలక్రిష్ణ టాలీవుడ్ సీనియర్ హీరో. ఆయన వందకు పైగా మూవీస్ చేశారు. ఎందరో కధానాయికలతో ఆడిపాడారు. ఇపుడు బాలయ్య 105వ సినిమాగా కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో కొత్త మూవీ చేయబోతున్నారు. ఈ నెల 17న లాంచనంగా ప్రారంభం అవుతున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి.  అవి బాలయ్య ఫ్యాన్స్ లో ఎక్కడలేని హుషార్ ని తెస్తున్నాయి.


తాజాగా వచ్చిన న్యూస్ ప్రకారం ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా బాలయ్య పక్కన కాజల్ అగర్వాల్ నటిస్తోందని అంటున్నారు. రూలర్ పేరుతో నిర్మిస్తున్న ఈ మూవీలో రెండవ హీరోయిన్ గా హరిప్రియను ఇప్పటికే సెలెక్ట్ చేశారు. బాలయ్య కాజల్ అంటే ఇది రేర్ కాంబోగానే చూడాలంటున్నారు. ఇంతకు ముందు చిరంజీవి 150వ సినిమాలో నటించిన కాజల్ ఇపుడు మరో సీనియర్ హీరో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకుంటోందని అంటున్నారు.


అమ్మడు, కుమ్ముడు అంటూ చిరుతో స్టెప్పులేసిన ఈ ముద్దు గుమ్మ ఇపుడు బాలయ్యతో ఏ రేంజిలో రెచ్చిపోతుందో చూడాలని అంటున్నారు. కాజల్ గ్లామర్ ఈ సినిమాకు కొత్త బలమేనని అంటున్నారు. ఇక ఈ మూవీని చకచకా పూర్తిచేసి వచ్చే సంక్త్రాంతికి పందెం కోడిగా దించేసందుకు నిర్మాత సీ కళ్యాణ్ రెడీ అవుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: