నిన్నజరిగిన ‘మహర్షి’ సక్సస్ మీట్ లో విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి మహేష్ పై వేసిన సెటైర్లు ఆ ఈవెంట్ కు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆ ఈవెంట్ కు వచ్చిన అందరికీ విపరీతమైన నవ్వులు తెప్పించాయి. మహేష్ ను చూసినప్పుడల్లా తనకు ఆడపిల్లగా తాను పుట్టి ఉంటే మహేష్ పెళ్ళికి ఒప్పుకునే వరకు వెంటపడటమే కాకుండా ఒకవేళ మహేష్ ఒప్పుకోకపోతే మహేష్ ను చూస్తూ బతుకుతానని ఒకవేళ తనను పెళ్ళాడటం మహేష్ కు ఇష్టం లేకపోయినా ఎడ్జెస్ట్ అయిపోతానని మహేష్ తో తాను బేరసారాలు ఆడిఉండేవాడిని అంటూ పోసాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

అంతేకాదు తాను మహేష్ లా అందంగా ఎందుకు పుట్టలేదు అని తనకు తానే బాధపడుతూ ఉంటానని మహేష్ అంత అందంగా ఉంటే తనకు అమ్మాయిలలో ఏర్పడే క్రేజ్ ను తలుచుకుంటూ కలలు కంటున్నానని పోసాని చేసిన కామెంట్స్ కు ఆ ఫంక్షన్ కు వచ్చిన వారంతా తెగ నవ్వుకున్నారు. ఇదే సందర్భంలో పోసాని పూజ హెగ్డే పై సెటైర్లు వేస్తూ పూజ మహేష్ అందం ముందు తేలిపోయిందనీ ఈ విషయం అనేకమంది విమర్శకులు పేపర్లలో టెలివిజన్ లలో చెప్పిన విషయాన్ని కూడ పోసాని బయట పెట్టాడు. 

దీనితో మహేష్ పై పోసాని చేసిన ఈ మితిమీరిన పొగడ్తలు హాట్ టాపిక్ గా మారాయి. మరికొందరైతే పోసాని లాంటి భార్యను మహేష్ చేసుకుంటే అతడి పరిస్థితి ఏమిటి అంటూ ఆ ఫంక్షన్ లో జోక్స్ కూడ చేసారు. ఇది చాలదు అన్నట్లుగా పోసాని దిల్ రాజ్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడ చేసాడు.

ఏడాదికి దిల్ రాజ్ తీస్తున్న ఐదారు సినిమాలు వల్ల ఇందాస్త్రీలోని డైరెక్టర్ల నుండి కారు డ్రైవర్ల వరకు బతికేస్తున్నారు అంటూ దిల్ రాజ్ చిన్న సినిమాను ఎంత ప్రేమిస్తాడో పెద్ద సినిమాను కూడ అదే స్థాయిలో ప్రేమిస్తాడు అంటూ పోసాని దిల్ రాజ్ భజన కూడ చేసాడు. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పోసాని ఇలా మహేష్ పై తన క్రష్ ను బయటపెట్టడం ఇండస్ట్రీ హాట్ తావుఇక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: