మనకు అదృష్టం కలిసి వస్తే..ఎవరూ ఆపలేరు..కానీ ఆ అదృష్టం కలిసి రావాలంటే ఎంతో తపస్సు చేయాల్సి వస్తుంది.  ఇప్పుడు తెలుగు లో వస్తున్న ‘జబర్ధస్త్ కామెడీ షో’తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తన సత్తా చూపిస్తున్నారు.  అట్టడుతు స్థాయి నుంచి బుల్లితెర, వెండి తెరపై రాణిస్తున్నారు.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో జబర్ధస్త్ కమెడియన్లు బాగా పాపులర్ అవుతున్నారు.  


తాజాగా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయిన కొమురం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'పశువులంటే నాకు పాణం .. ' అంటూ తెలంగాణ యాసలో చేసిన ఒక యాడ్ కి సంబంధించిన అనుకరణ ఆయనకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.  లేడీ గెటప్ లో కనిపించే కొమురం నిజంగా తెలంగాణ మహిళలు ఎలా ఉంటారో తన స్కిట్స్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.  తాను గ్రామస్థాయి నుంచి వచ్చానని..నేను పదో తరగతి వరకే చదివాను .. మా ఊళ్లోనే పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడిని. నేను మిమిక్రీ చేస్తుండటంతో, మా ఊళ్లోవాళ్లంతా సినిమాల్లో ట్రై చేయరా అని చెప్పారు. 


తన స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్ కి వచ్చి ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగానని..కానీ ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ కూడా రాలేదని..తెచ్చిన డబ్బు అయిపోవడంత ఓ హోటళ్లో పనికి కుదిరానని అన్నారు. ఊళ్లో ఉండి కనీసం పొలం పనులైనా చూసుకునే వాడిని...ఇక్కడకు వచ్చి  హోటల్లో ప్లేట్లు కడిగే పరిస్థితి వచ్చిందని చాలా ఏడ్చేవాడినని అన్నారు.  


కానీ అదృష్టం కలిసి వచ్చి జబర్ధస్త్ లో చిన్న ఛాన్సు రావడం..నా పాత్రను అందరూ మెచ్చుకోవడంతో నా దశ తిరిగిందని అన్నారు. బర్రెలు కాసుకునే నేను నానీతో కలిసి 'జెర్సీ' సినిమాలో నటిస్తానని ఎంతమాత్రం అనుకోలేదు. నానీ నన్ను ఒక ఫ్రెండులా చూసుకున్నాడు. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం అని చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: