టాలీవుడ్‌లో మాస్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ఎంతో మంది స్టార్ హీరోల‌కు సైతం హిట్లు ఇచ్చారు. అఖిల్ సినిమా నుంచి వినాయ‌క్ కెరీర్ తిరోగ‌మ‌నంలో ఉంది. ఒక‌ప్పుడు వినాయ‌క్‌తో సినిమాలు తీసేందుకు క్యూలో ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు ఆయ‌న క‌థ చెపుతాన‌న్నా వినే ప‌రిస్థితుల్లో లేరు. దీనిని బ‌ట్టి వినాయ‌క్ ఫామ్ ఎంత‌లా దిగ‌జారిపోయిందో ?  తెలుస్తోంది. ఇంటిలిజెంట్ సినిమా త‌ర్వాత వినాయ‌క్‌కు బాల‌య్య ఓ ఛాన్స్ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా అది కూడా ఎందుకో గాని ప‌ట్టాలు ఎక్క‌లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు వినాయ‌క్ హీరోగా మారుతున్నారు. విన‌డానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే అని అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. వినాయ‌క్ వ‌య‌స్సు, ఫిజిక్‌కు త‌గిన పాత్ర‌లో ఓ స్క్రిఫ్ట్ రెడీ అవ్వ‌డం.. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు కూడా ఫిక్స్ అవ్వ‌డం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. డైరెక్ట‌ర్ శంక‌ర్ అసిస్టెంట్ న‌ర‌సింహ‌రావు అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స్క్రిఫ్ట్ నిర్మాత దిల్ రాజుకు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌.

వెంట‌నే రాజు ఈ స్క్రిఫ్ట్ నెరేష‌న్‌ను వినాయ‌క్‌కు చెప్పించ‌డం, విన‌య్ ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ రోజు, రేప‌ట్లో ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందంటున్నారు. తిరుప‌తిలో మ‌హ‌ర్షి టీంతో ఉన్న దిల్ రాజు అక్క‌డే ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదా ?  హైద‌రాబాద్ వ‌చ్చిన వెంట‌నే విన‌య్ హీరోగా న‌ర‌సింహ‌రావు డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే సినిమాపై ప్రెస్‌మీట్ పెడ‌తార‌ని అంటున్నారు.

ఇక 2003 వ‌ర‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న దిల్ రాజు విన‌య్ డైరెక్ష‌న్‌లో నితిన్ హీరోగా వ‌చ్చిన దిల్ సినిమాతో నిర్మాత‌గా మారారు. అప్ప‌టి వ‌ర‌కు వి.వెంకట రమణారెడ్డి పేరు కాస్తా దిల్ రాజుగా మారిపోయింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌నే. ఇప్పుడు అదే వినాయ‌క్‌ను హీరోగా పెట్టి దిల్ రాజు నిర్మాత‌గా సినిమా చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: