టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కెరియర్ మళ్లీ ఊపందుకుంది. ఖైది నంబర్ 150 సినిమాతో అమ్మడు వరుస అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం సీత సినిమా చేస్తున్న కాజల్ ఆ తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ సినిమా అని అంటున్నారు. బాలయ్య హీరోగా కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది.


ఈ నెల 17న లాంచ్ అవనున్న ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ ప్లే చేస్తారని అంటున్నారు. అందులో ఒకటి పోలీస్ పాత్ర అట. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉండగా ఒక హీరోయిన్ కాజల్ మరో హీరోయిన్ హరిప్రియను సెలెక్ట్ చేశారట. కె.ఎస్ రవికుమార్ తో బాలకృష్ణ జై సింహా సినిమా చేశారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.  


మళ్లీ మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా కోసం కాజల్ భారీగానే డిమాండ్ చేస్తుందట. అసలైతే సీనియర్ హీరోలతో చేయనని చెప్పేసిన కాజల్ ఖైది నంబర్ 150లో చిరుతో చేశాక సీనియర్ స్టార్స్ తో చేస్తే అడ్వాంటేజ్ ఏంటన్నది కనిపెట్టింది. అందుకే బాలయ్య సినిమా ఆఫర్ రాగానే ఓకే చెప్పేసిందట.


ముందు ఈ సినిమాలో నయనతారను తీసుకోవాలని అనుకున్నారు ఆమె వేరే కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా చేయనని చెప్పిందట. మొత్తానికి బాలయ్యతో కాజల్ రొమాన్స్ షురూ కానుంది. ఈ సినిమాకు నిర్మాతగా సి. కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. మరి బాలకృష్ణ, కాజల్ జోడీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: