కొన్ని సినిమాలు సూపర్ హిట్టయినప్పటికి, సినిమా చూసిన  ప్రేక్షకులుకు కొన్ని సీన్స్ కానీ, అలాగే కొన్ని క్యారెక్టర్స్ గానీ ఇలా ఉంటే బావుంటుంది. ఇలా  అయితే ఇంకా బావుండేది అన్న ఫీలింగ్ వస్తుంటుంది. అందుకు కారణం మన దర్శకులు హీరో ఇమేజ్ ని దృష్ఠ్లో పెట్టుకొని కథలు రాయడం, అలాగే సన్నివేశాలు తీయడం, అవసరమనిపించకపోయినా ఫైట్స్ పెట్టడం, అనవసరమైన చోట సాంగ్స్ ఇరికించడం, కావాలనే కామెడీని క్రియోట్ చేయడం వంటి అనవసరమైన పనులు చేస్తుంటారు. 


దాదాపు ఇలాంటి కారణాల వల్లే హిట్, సూపర్ హిట్టవ్వాల్సిన సినిమాలు కూడా ప్రేక్షకులకు రుచించక డిజాస్టర్స్ గా మిగిలిపోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారు. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కలవక పోయినా, చనిపోయినా సినిమా మొత్తం బావున్నప్పటికి ఈ ఒక్క సీన్ వల్ల సినిమా ఫ్లాప్ అనేస్తారు. అంతే తప్ప కథకు ఇలాంటి ఎండిగ్ 100% కరెక్ట్ అని అనలేరు. 


అందుకు ఉదాహరణ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన 'ఠాగూర్', 'టెంపర్'. వీటిలో 'ఠాగూర్' తమిళంలో 'రమణ'గా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో క్లైమాక్స్ లో చనిపోతాడు...అలాగే టాలీవుడ్‌లో ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ సినిమాను విశాల్ హీరోగా అయోగ్య పేరుతో నిర్మించారు. ఈ సినిమా కోలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజై హిట్ టాక్ తో సక్సస్ ఫుల్ గా రన్నవుతోంది. అయితే తెలుగులో తారక్ క్లైమాక్స్ సీన్ లో బతికే ఉంటాడు. కానీ తమిళంలో విశాల్ నటించిన అయోగ్య లో మాత్రం క్లైమాక్స్ లో చనిపోతాడు. ఈ ఎండింగ్ సూపర్ అని కోలీవుడ్ లో విశాల్ ని తెగ మెచ్చుకుంటున్నారు. అందుకే మనకంటే కోలీవుడ్ హీరోలే బెస్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: