వ్య‌వ‌సాయం దండగ కాదు పండుగ కావాల‌ని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి..గులాబీ బాస్ కేసీఆర్. ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ‌లో నీళ్లు పారించేందుకు..ప్ర‌తి ప‌ల్లెలో వ్య‌వ‌సాయం చేసేందుకు మార్గం సుగమం చేశారు. రాబోయే 2020 సంవ‌త్స‌రానిక‌ల్లా తెలంగాణ అంత‌టా 60 శాతానికి పైగా పొలాలు ప‌చ్చ‌గా మార‌నున్నాయి. ఆ దిశ‌గా ఇప్ప‌టికే జ‌నంలో చైత‌న్యం తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది ప్ర‌స్తుత స‌ర్కార్. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల‌లో తీవ్రంగా ..అపారంగా న‌ష్ట‌పోయింది. వివ‌క్ష‌కు గురైంది. ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, మోసానికి లోనైంది. ప్ర‌తి రైతుకు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ఎన్నో స‌బ్సిడీలు, బ్యాంకుల ద్వారా రుణాలు అంద‌జేస్తోంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రు పొలాలు కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డుతున్నారు. ఎన్ ఆర్ ఐలు , సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు, ఇత‌ర శాఖ‌ల్లోని, సంస్థ‌ల్లోని ఉద్యోగులు భారీ ఎత్తున పొలాలు తీసేసుకున్నారు. 


అక్క‌డి నుంచే ఇక్క‌డ మానిట‌రింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల పండ్ల తోట‌లు, పురుగు మందులు లేని వ్య‌వ‌సాయాన్ని, సాగును ప్రారంభించారు. రాబోయే కాలానికి ప్ర‌స్తుతం ఉన్న జ‌నాభాకు అనుగుణంగా ఎక్కువ మొత్తంలో కూర‌గాయ‌లు, పండ్లు, వ‌రి, త‌దిత‌ర పంట‌ల‌న్నీ త‌ప్ప‌క పండించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. చిరు ధాన్యాల ప్రాముఖ్య‌త పెర‌గ‌డం, ప్ర‌జ‌లు కొనుగోలు చేసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. వ్య‌వ‌సాయం ప్రాముఖ్య‌త‌, రైతుల గొప్ప‌ద‌నం, సాగు చేస్తే క‌లిగే అనుభ‌వం ఇలా ప్ర‌తి అంశాన్ని కేంద్రంగా తీసుకుని ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన మ‌హ‌ర్షి సినిమా ప్రేర‌ణ‌గా నిలుస్తోంది. ఆ సినిమా దీని చుట్టే తిరుగుతుంది. సినిమాను చూసిన వారు, మ‌హేష్ బాబు ఫ్యాన్స్, ఫాలోయ‌ర్స్ అంతా ఇపుడు అగ్రిక‌ల్చ‌ర్ చేయాల‌ని పిలుపునిస్తున్నారు. దాని వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచి ప‌రిణామం. పాపుల‌ర్ స్థాయిలో ఉన్న వారు ఇలా వ్య‌వ‌సాయం చేయ‌మ‌ని పిలుపునిస్తే ఎంతో కొంత మార్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది. 


డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి , నిర్మాత దిల్ రాజులు తీసిన ఈ సినిమా మ‌హేష్ బాబుకు కెరీర్ ప‌రంగా 25వ సినిమా. స‌క్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది వీకెండ్ వ్య‌వ‌సాయం సాగు చేసేందుకు రెడీ అంటున్నారు. ఇందు కోసం అగ్రిక‌ల్చ‌ర్ ఎక్స్ ప‌ర్ట్స్ తో ముచ్చ‌టిస్తున్నారు. రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేలా , వారికి స‌పోర్ట్ ఇచ్చేలా కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ప్రిన్స్ ఇచ్చిన పిలుపుతో ఇంకొంద‌రు ఇప్ప‌టికే రంగంలోకి దిగారు. సినిమాలో రైతు గొప్ప‌ద‌నం చూపించిన తీరు ఆక‌ట్టుకుంది. అన్న‌దాత‌కు కావాల్సింది జాలి కాదు..గౌర‌వం. రైతును కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిది అంటూ సందేశం ఇచ్చారు. వ్య‌వ‌సాయం చేయ‌ని ఇత‌ర ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా వారికి ఖాళీ దొరికే వీకెండ్ స‌మ‌యాల్లో వ్య‌వ‌సాయం చేయాల‌నే పాయింట్‌ను కూడా ఇందులో దర్శ‌కుడు ట‌చ్ చేశాడు. ఈ అంశం చాలా మందికి రీచ్ అయ్యింది. నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ కూడా ఉన్నారు.  సో మీరూ కూడా వీలైతే రైతుగా మారి పోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: