సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి సినిమా సంచలన విజయం అందుకుంది. కమర్షియల్ సినిమానే కాని అందులో ఓ చిన్న మెసేజ్ తో మహర్షి వచ్చింది. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకున్న మహర్షి 5వ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టింది. 


తెలుగు రెండు రాష్ట్రాల్లో సోమవారం కూడా 4.10 కోట్లను వసూళు చేసింది మహర్షి మూవీ మొత్తంగా 5 రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 51.70 కోట్ల షేర్ సాధించింది. ఫస్ట్ వీకెండ్ లో టాప్ 5 సినిమాల్లో స్థానం సంపాదించుకుంది మహర్షి మూవీ. ఇక ఏరియా వైజ్ మహర్షి 5 రోజుల కలక్షన్స్ చూస్తే..


నైజాం : 18.47 కోట్లు 
సీడెడ్ : 6.15 కోట్లు
ఉత్తరాంధ్ర : 6.06 కోట్లు
ఈస్ట్ : 5.16 కోట్లు
వెస్ట్ : 3.96 కోట్లు
గుంటూరు : 6.12 కోట్లు
కృష్ణా : 3.90 కోట్లు
నెల్లూరు : 1.85 కోట్లు 
ఏపి/తెలంగాణ : 51.67 కోట్లు  



మరింత సమాచారం తెలుసుకోండి: