వ్యవసాయాన్ని ప్రధానాంశంగా తీసుకొని రైతుల కష్టాలను బాధలను తెలియజేసే సినిమాగా తెరకెక్కించారు మహర్షి సినిమాని. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే 25వ సినిమా గా రావటంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమాకి మరే సినిమా పోటీ లేకపోవడంతో తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు.

Image result for maharshi

చాలామంది ఈ సినిమా చూసిన ప్రముఖులు మహర్షి సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి నెగటివ్ వార్త ఒకటి ఇప్పుడు బయట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమా యూనిట్ ఇటీవల “వీకెండ్ అగ్రికల్చర్” పేరు పెట్టి వ్యవసాయం చెయ్యండి అని ఇచ్చిన ఛాలెంజ్ కు మహేష్ అభిమానులు చాలా మందే ఆ వీకెండ్ లో ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో షేర్లు చేసుకున్నారు.

Image result for maharshi

దీనితో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.వ్యవసాయం అంటే ఏదో సరదాగా వారాంతంలో మాత్రమే చేసికునేది కాదు.ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టుకున్నంత మాత్రాన రైతుల కష్టాలను గుర్తించినట్టు కూడా కాదు ఇందులో మీ సినిమా ప్రమోషన్లు కనపడుతున్నాయి తప్ప రైతుల మీద గౌరవం కానీ ప్రేమ కానీ ఎక్కడా కనిపించడం లేదు అని సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా తర్వాత సినిమాలు చేస్తున్నా ఆ సమయంలో కూడా ఇదే ప్రోగ్రాం ని కంటిన్యూ చేయగలరా అంటూ కొంత మంది నెటిజన్లు సినిమా యూనిట్ కి సవాళ్లు కూడా చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: