ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ బిజినెస్ ప్రారంభించబోతున్నట్టు తెగ వార్తలు వస్తున్నాయి. అయితే వచ్చిన వార్తలపై వాస్తవం లేదని ఇటీవల అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. దీంతో ఎప్పుడూ మెగా ఫ్యామిలీ పై ఏదో ఒక దుర్వార్త బయటకు రావడం ఎవరో ఒకరు దానికి వివరణ ఇవ్వటం పరిస్థితి ఇలాగే ఉండటంతో రాంచరణ్ ఫుల్ గా సీరియస్ అయినట్లు సమాచారం.

Related image

శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించబోతున్నాడని.. ఆ విద్యాసంస్థ బాధ్యతలని నాగబాబు, రాంచరణ్ నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ పీఆర్ టీం అధికారికంగా స్పందించింది. చిరంజీవి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని తేల్చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాలనే ఆలోచన మెగా అభిమానులది. దీనితో చిరంజీవి, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు.

Image result for ram charan serious

ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆయనను కించపరిచే విధంగా..డబ్బు దాహంతో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా వ్యాపారం చేయబోతున్నారని కథనాలు ప్రసారం చేస్తున్నారని వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ సీరియస్ అయ్యారట. మాకు డబ్బు కావాలంటే కోట్లలో ఆదాయం వచ్చే ఇంకా మెరుగైన వ్యాపారాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ని, అది కూడా వెనుకబడిన శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో ఎందుకు ప్రారంభిస్తాం అని చరణ్ ఘాటైన వ్యాఖ్యలు చేసారట. మొత్తం మీద మెగా ఫ్యామిలీ పై లేనిపోని కథనాలు వార్తలు ప్రసారం చేసిన వారిపై రాంచరణ్ తీవ్రంగా ఆగ్రహించినట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: