ఈ ఏడాది జరుగుతున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తారల సందడి బాగానే కనిపిస్తుంది.  ఇప్పటికే ముఖ్య పార్టీల తరుపు నుంచి సినీ తారలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  విశ్వనటుడు  కమల్ హాసన్ పార్టీ 'మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) తరుపు నుంచి ఆయన పోటీ చేస్తానన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ పార్టీ తరుపు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు..ప్రచారాలు కూడా చేస్తున్నారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసి సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేశాయి.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్నిక‌ల నియ‌మావ‌లిని ఉల్లంఘించి చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డుతున్నారు. 12 ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మైనారిటీలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతంలో మాట్లాడుతూ .. దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు.మహాత్మా గాంధీని చంపిని నాథూరాం గాడ్సేనే స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది అని ఆరోపించారు. 


దాంతో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌పై భాజాపా నేత‌లు మండిప‌డిన సంగ‌తి తెలిసిందే.  కమల్ హాసన్ హిందూ మతాన్ని ఉగ్రవాదానికి ముడిపెట్టడం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని దాఖలైన ఫిర్యాదు మేరకు..ఢిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టులో కమల్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: