టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన దాదా ఫాల్కె అవార్డు గ్రహీత డి.రామానాయుడు తనయుడు డి సురేష్ బాబు వారసుడు దగ్గుబాటి రానా ‘లీడర్’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. బాబాయిలా స్టార్ హీరో ఇమేజ్ చట్రంలో ఉండకుండా తనకు నచ్చిన పాత్రలు ఎంచుకుంటూ జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా బహు భాషా సినిమాగా తెరకెక్కుతున్న ‘హాథీమేరి సాథీ’ లో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో రానా బాగా పెరిగిన గెడ్డంతో వయసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అయితే రానా ప్రతి సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా తనను తాను మల్చుకోవడం అలవాటు.. ఈ నేపథ్యంలోనే బాహుబలి సినిమాలోని భల్లాలదేవుడి పాత్ర కోసం బాగా బరువు పెరిగిన రానా ‘ఘాజి’ సినిమా కోసం మళ్లీ బరువు తగ్గడం, ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన రానా చంద్ర బాబు లాగానే కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా రానాకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుబురు గడ్డంతో తో పెద్ద జుట్టు తో ఉన్న సరికొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. లూజ్ బట్టలతో రఫ్ లుక్ తో కనిపిస్తున్న రానా ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేదో రానా కు డూప్ ఫోటో అని కొందరు..అసలు రానాకు ఏమైంది..అని కొందరు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో నటించనున్నాడు రానా. అంతేకాదు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హిరణ్యకశ్యప అనే పౌరాణిక చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.