ఒక్క 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం ని తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ అంతా యూత్ ఆడియన్స్ లో విజయ్ దేవరకొండకు ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. దీంతో పాటు టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి అనికూడా యూత్ తెగ ఆనందపడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 


ప్రస్తుతం కొంతమంది యంగ్ హీరోస్ రొమాంటిక్ సీన్స్‌కి, లిప్ లాక్స్ కి దూరంగా ఉంటున్నారు. కానీ విజయ్ మాత్రం కథ డిమాండ్ చేస్తే మాత్రం.. ఏమాత్రం ఆలోచించకుండా లిప్ లాక్ సీన్స్ చేయడానికి అందరికంటే ముందుంటున్నాడు. యూత్ కూడా విజయ్ సినిమాలో ఈ సీన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఏమాత్రం వల్గారిటీ లేకూండా మేయిన్‌టైన్ చేయడం విజయ్ లో పెద్ద ప్లస్ పాయింట్. అందుకే విజయ్ సినిమాలు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా చూస్తున్నారు.


ఇక విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా కోసం రాశి ఖన్నాతో జత కడుతున్నాడు. విజయ్-రాశీఖన్నా కాంబినేషన్ అనగానే అందరిలో ఒకేరకమైన ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో కూడా విజయ్ తో రాశీ రొమాన్స్ చేయబోతోందా అని. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన సీన్స్ ని తెరకెక్కించబోతున్నారట దర్శకుడు క్రాంతి మాధవ్. మరి ఆ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని ప్రేక్షకులు తెగ ఊహించుకుంటున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: