ఇటీవ‌లె విడుద‌లైన మ‌జిలీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు  చై, స్యామ్‌. ఇక చైత‌న్య త‌రుప‌రి చిత్రం ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
ఓ కొత్త కుర్రాడు దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 


ఇక చంద‌మామ కాజ‌ల్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఇటు తెలుగు అటు త‌మిళ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఒక‌వైపు సీనియ‌ర్ హీరోస్‌తో న‌టిస్తూనే మ‌రో వైపు కుర్ర హీరోల‌తో జ‌త క‌డుతుంది కాజ‌ల్‌. ప్ర‌స్తుతం తాను తెలుగులో సీత అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. నాయిక ప్ర‌ధాన నేప‌థ్యంలో సాగే చిత్రం సీత కాగా, ఇందులో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్నాడు. తేజ మూవీని డైరెక్ట్ చేశాడు. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మ‌రి కొద్ది రోజ‌ల‌లో విడుద‌ల కానున్న సీత చిత్రానికి సంబంధించి ఎలాంటి వైబ్రేష‌న్స్ లేవు. 


చిత్రానికి సంబంధించిన వారంద‌రికి వ‌రుస ఫ్లాపులు డీలా ప‌డేలా చేశాయి. ఇప్పుడు మంచి స‌క్సెస్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేప‌థ్యంలో కాజ‌ల్ సినిమాని నిలబెట్టి వారంద‌రి కెరీర్‌కి బూస్ట‌ప్ ఇస్తుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. సీత చిత్రంలో కాజ‌ల్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో పాటు గ్లామ‌ర్‌తోను ఆడియ‌న్స్‌ని థియేట‌ర్స్‌కి ర‌ప్పించాల‌ని మేక‌ర్స్ కోరుకుంటున్నారు. మ‌రి ఇక‌ముందు ముందు కాజ‌ల్ ఎవ‌రెవ‌రికి లైఫ్ ఇస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: