ప్రపంచంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ వస్తున్న సినిమా ‘జేమ్స్ బాండ్’.  ఛేజింగ్, ఫైటింగ్, సస్పెన్స్, వెరైటా కార్లు, బైకులు, వెపన్స్ ఇవన్నీ జేమ్స్ బాండ్ సినిమాల్ల చూడవొచ్చు.  ఇప్పటి వరకు జేమ్స్ బాండ్ సీరీస్ ఎన్నో వచ్చాయి..అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి.   తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌కు తీవ్ర గాయం అయ్యింది. 


ప్రస్తుతం డేనియల్ జేమ్స్ బాండ్ 25వ చిత్ర షూటింగ్ జరుగుతోంది. వెస్టిండీస్ లోని జమైకాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో కింద పడిపోవడం వల్ల డేనియల్ కాలికి తీవ్రగాయమైనట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.  ఆయన సెట్‌లో పరిగెడుతున్నప్పుడు కిందపడిపోయారు. కాలికి తీవ్ర గాయడం కావడంతో డేనియల్‌ చాలా బాధపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయన్ను అమెరికాకు తీసుకెళ్లారని  ఆ పత్రిక వెల్లడించింది.


అయితే ఈ గాయం నుంచి కోలుకోవడానికి డేనియల్ కు చాలా సమయం పట్టొచ్చని అంటున్నారు. దీనితో అప్పటి వరకు జేమ్స్ బాండ్ 25వ మూవీ ఆగిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి.  సాధారణంగా జేమ్స్ బాండ్ సినిమాలంటే భారీ బడ్జెట్ తో రూపొందుతాయన్న విషయం తెలిసిందే.  అయితే  చిత్ర యూనిట్ త్వరలో కీలకమైన షెడ్యూల్ కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కాగా, గాయం కారణంగా ఆ చిత్రీకరణ భాగాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. 


గతంలో కూడా ఇక  డేనియల్‌ క్రెయిగ్‌ చాలా వరకు డూప్ లేకుండానే ఎంతో కష్టతరమైన స్టంట్స్ చేస్తారని టాక్.   దాంతో చాలా సార్లు గాయాలపాలయ్యారు. ‘జేమ్స్‌ బాండ్‌’గా నటించిన తొలి చిత్రం ‘క్యాసినో రాయల్‌’ చిత్రీకరణ సమయంలో డేనియల్‌ స్టంట్స్‌ చేస్తున్నప్పుడు కిందపడి ఆయన పళ్లు ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సినిమాకు కేరీ దర్శకత్వం వహిస్తున్నారు. జమైకా, నార్వే, లండన్‌, ఇటలీలో సినిమాను చిత్రీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు తనకు ఎలాంటి గాయమైనా లేక్కచేయకుండా నటిస్తున్న  డేనియల్‌ క్రెయిగ్‌ కొలుకొని ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: