తాప్సీ కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'జుమ్మంది నాదం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. షాడో, వీర, గుండెల్లో గోదారి, మొగుడు, దరువు, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాదు తమిళం, మళయాళం తో పాటు హిందీలో చాలానే సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్ లో మాత్రం తాప్సీ బాగా సెటిలైందని చెప్పాలి. ముల్క్, పింక్, జుడ్వా-2, నాం షభానా, బద్లా వంటి సినిమాలు తాప్సీకి ఎంతో ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా బిగ్ బి అమితాబ్ తో నటించిన పింక్, బద్లా తన సినీ కెరీర్‌లో గుర్తుండిపోయో సినిమాలు. 

ఇక రీసెంట్‌గా BFFs విత్ వోగ్ - సీజన్ 3 షో కు విక్కీ కౌశల్ తో కలిసి హాజరయింది. తాప్సీ.. విక్కీ కౌశల్ 'మన్మర్జియా' లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ షో లో తాప్సీ విక్కీని పరిచయం చేస్తూ "అందరూ మగాళ్ళు (బీప్) కానీ విక్కీ ఈజ్ ది బెస్ట్" అంటూ కామెంట్ చేసింది. 'మన్మర్జియా' షూటింగ్ కంటే ముందే వాళ్ళ మధ్య ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ గురించి షో లో వివరించింది.  ఇక  వరుణ్ ధావన్.. విక్కీ కౌశల్.. అభిషేక్ బచ్చన్ ముగ్గురిలో ఎవరిని  హుక్ అప్.. మ్యారీ.. కిల్" అని అడిగితే ఒక్క క్షణం ఆలోచించకుండా "వరుణ్ తో హుక్ అప్.. అభిషేక్ ను కిల్ చేస్తా.. విక్కీ ని మ్యారేజ్ చేసుకుంటా" అని చెప్పేసింది.   


విక్కీ గురించి కంటిన్యూ చేస్తూ విక్కీ పెళ్ళికి పనికొచ్చే మెటీరియల్ అంటూ హొయలు పోయింది. అంటే ఫ్యూచర్‌లో విక్కీని పెళ్ళి చేసుకున్న షాకవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. ఇక తాప్సీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే హిందీలో 'తడ్కా'.. ' మిషన్ మంగళ్'.. 'సాంద్ కీ ఆంఖ్' సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటుగా తెలుగు-తమిళ భాషలలో రిలీజ్ కానున్న 'గేమ్ ఓవర్' సినిమాలో కూడా నటిస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: