తెలుగు సినిమా చరిత్రలో మహానటిగా పేరెన్నికగన్న సావిత్రిగారి జీవిత చరిత్ర ఆధారంగా, ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణంలో నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత బయోపిక్ చిత్రం మహానటి. ఇక ఈ సినిమా విడుదల తరువాత ఇప్పటితరం వారు కూడా ఆ మహానటి సావిత్రి గారి నటనా పటిమ మరియు మంచితనం గురించిన ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారు. ఇక విడుదల తరువాత ఈ సినిమా మంచి రికార్డునే సొంతం చేసుకుని, ఇప్పటివరకు టాలీవుడ్లో వచ్చిన అన్ని బయోపిక్ లలో ఈ చిత్రమే అత్యధిక వసూళ్లు అందుకుని అద్భుత రికార్డు క్రియేట్ చేసింది. 


ఇక ఈ సినిమాపై అప్పట్లో ఎందరో నటీనటులు మరియు ప్రముఖులు పలువిధాలుగా ప్రశంశలను కురిపించారు. ఇక నేడు ఒకప్పటి సీనియర్ నటి షావుకారు జానకి గారు మాట్లాడుతూ, అప్పట్లో సినిమాలకు కొన్ని పరిధులు ఉండేవని, ఏదైనా చిత్రంలో ఎవరైనా నటీనటులు ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది కలిగించేలా వస్త్రధారణ చేసినట్లయితే, వెంటే సెన్సార్ వాళ్ళు అటువంటి సన్నివేశాలను తొలగించేవారని, అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి సెన్సార్ వాళ్ళు అటువంటివి పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇక సావిత్రి గారి గురించి మాట్లాడుతూ, ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువేనని, సెట్ లో ఆమె ఉన్నంతసేపు సెట్ మొత్తం ఒక సందడి వాతావరణంతో నిండిపోయేదని, ఇక ఆమె అందరిని పేద, ధనిక అని తేడా లేకుండా సమాన దృష్టితో చూసేవారని, ఎవరికైనా ఏదైనా సమస్యవస్తే తనవంతుగా సాయం అందించడానికి ఎప్పుడూ మునుండేవారని అన్నారు. 


అయితే అంతటి గొప్పనటి జీవితం ఆధారంగా సినిమా తీయడం సరైనది కాదని, అయితే తాను మహానటి సినిమాను తప్పు పట్టడం లేదని, నిజానికి తాను సినిమా చూడలేదని, తనకు సినిమా చూసిన వారు చెప్పిన దాని ప్రకారం, సినిమా చివరిలో సావిత్రి గారు ఎంతటి ఇబ్బందులు మరియు వ్యధను అనుభవించారు అనేది చూస్తే మన మనసుకు ఎంతో బాగా కలుగుతుందని, కాబట్టి ఆ సినిమా తీయకుండా ఆమెని ఒక అద్భుత నటిగానే మన మనస్సుల్లో గుర్తుంచుకుంటే బాగుంటుందని, ఆమె జ్ఞాపకాలు మనకు ఎప్పటికి మన ప్రేక్షకుల మనస్సులో తీపి గుర్తులుగానే మిగిలిపోతాయి అనేది తన అభిప్రాయం అని అన్నారు....    

మరింత సమాచారం తెలుసుకోండి: