కలర్.. గ్లామర్... యాక్టింగ్ కలిస్తేనే... సినిమా. ఈ రంగంలోకి రావాలని అనుకునే వాళ్ల ఎలాగైనా హిట్ కొట్టి లైఫ్ లో సెటిల్ కావాలని అనుకోవడం సహజం. అలా అనుకోకపోయినా అలాంటి లక్ష్యాలు పెట్టుకోకపోయినా ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టం. అందుకే ఒక్క ఛాన్స్ అని తిరుగుతుంటారు. హిట్ కొడుతుంటారు. ఒక్కోసారి ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటవెంటనే మంచి సినిమాలు వస్తాయి. ఒక్కసారిగా స్టార్ హోదాలోకి వెళ్ళిపోతారు.
అలా వెళ్ళాక ఆ హోదాను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. స్టార్ హోదా వచ్చాక ఆచి తూచి అడుగు వేస్తుంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే భారీ హిట్ అందుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ అందుకొని తరువాత వరసగా హిట్ సినిమాలు చేసి స్టార్ హోదాను సంపాదించుకున్న ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా లేవు. అటు బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ తో దేదే ప్యార్ దే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కావాల్సినంత అందాలను ఆరబోసింది.
అది హిట్టయితే అక్కడ ఛాన్స్ రావొచ్చు. తమిళంలో కార్తీ తో చేసిన దేవ్ బోల్తా కొట్టడంతో... అన్న సూర్య సినిమాపైనే అసలు పెట్టుకుంది రకుల్. సూర్య హీరోగా చేస్తున్న ఎన్జీకే సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ఓ కీలక పాత్ర చేస్తోంది. పాత్ర కీలకమే కానీ మెయిన్ హీరోయిన్ కాదు. ఒక్కటే పీస్ పిల్ల ఫిదా భామ సాయి పల్లవి మెయిన్ హీరోయిన్. ఎన్జీకే సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యూనిట్.
సూర్య చేతిని ఆప్యాయంగా చెంపకు హత్తుకుంటున్న ఫోటో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. నీ చేయి తాకితే చాలు... గుండెకు ఎంతో ధైర్యం అని చెప్పే విధంగా ఉంది ఆ ఫోటో. మరి ఫొటోకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందా... చూద్దాం.