డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి ఇద్దరికీ ప్రజెంట్ ఒక హిట్టు పడాల్సిందే. గత కొంత కాలం నుండి డైరెక్టర్ పూరి జగన్నాద్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సినిమాలు మొత్తం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో ఏ మాత్రం నిరాశ చెందకుండా తన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.


తన కొడుకు హీరోగా పెట్టి తాను నిర్మాతగా మారి మెహబూబా సినిమా తీసినా కానీ దారుణంగా ఫ్లాప్ అవడంతో వెంటనే పూరి జగన్నాథ్..ఫ్లాపుల్లో ఉన్న హీరో రామ్ ని హీరోగా పెట్టి ‘యస్మాత్ శంకర్’ అనే సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో రామ్ ఎప్పుడు కనిపించని విధంగా ఊర మాస్ స్టైల్ లో కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇటీవల రాం పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు సినిమా యూనిట్.

Image result for IsmartShankar

అయితే టీజర్ చూసిన ప్రేక్షకులు రామ్ బాడీ లాంగ్వేజ్ పట్ల అ సంతృప్తి చెందినట్లు...డైలాగులు కూడా అర్థం అయ్యి అర్థం కానట్లు రామ్ బాడీ లాంగ్వేజ్ కి డైలాగులకి అసలు సంబంధం లేనట్టుగా ఉండటంతో టీజర్ చూసిన ప్రేక్షకులు ఇదేమి టీజర్ అని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్ పై నెటిజన్లు తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ఇద్దరికి మరొక ఫ్లాప్ పడటం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: