టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్న భామ తాప్సి. ఈ పంజాబీ భామకి తెలుగులో అదృష్టం అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. రవితేజ, వెంకటేష్, గోపిచంద్, ప్రభాస్ లాంటి హీరోలతో జత కట్టిన ఈ భామ కెరియర్ లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ అని చెప్పాలి. కొన్ని సినిమాలు హిట్స్ అయిన కూడా సెకండ్ హీరోయిన్, లేదంటే గ్లామర్ పాత్రలకి పరిమితం అయిపోయిన తాప్సి టాలెంట్ ని తెలుగు దర్శకులు కాని, ఆడియన్స్ గాని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. 


అయితే టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన కేవలం గ్లామర్ పాత్రలకి మాత్రమే పరిమితం కావడంతో ఈ భామ బాలీవుడ్ వైపు ద్రుష్టి పెట్టి మొదటి సినిమా పింక్ తోనే తన నటన టాలెంట్ చూపించుకుంది. ఆ సినిమాలో తాప్సిలో ఎంత పెద్ద నటి ఉందో గుర్తించిన బాలీవుడ్ దర్శకులు, మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి తాప్సిని హీరోయిన్ గా తీసుకోవడం మొదలెట్టారు. దీంతో బాలీవుడ్ లో రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా కథా బలం ఉన్న సినిమాలతో తాప్సి సత్తా చాటుతుంది. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్న తాప్సి అందులో కథాబలం ఉన్న సినిమాలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 


ఇదిలా ఉంటే బీఎఫ్ఎఫ్స్ విత్ వోగ్  సీజన్ 3 షోకు యూరీ చిత్రంతో క్రేజీ హీరోగా మారిపోయిన  బాలీవుడ్ సెన్సేషన్ విక్కీ కౌశల్ తో కలిసి తాప్సీ హాజరయ్యింది. ప్రస్తుతం వీరిద్ద‌రూ మన్మర్జియా సినిమాలో కలిసి నటించారు. ఈ షో లో తాప్సీ విక్కీని పరిచయం చేస్తూ మగాళ్ళు అందరూ బీప్ అయిన విక్కీ మాత్రం మ్యారేజ్ మెటీరియల్ అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ షోలో విక్కీని పొగడటం వరకు ఒకే కాని మిగిలిన మగాళ్ళని బూతుని సంబోదించే విధంగా బీప్ అని అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: